Ee Nagaraniki Emaindhi : అప్పుడు గోవా.. ఇప్పుడు థాయిలాండ్.. ఇరవై రెట్లు ఎక్కువ బడ్జెట్ పెట్టి సీక్వెల్ సినిమా..
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ జరగనుంది. (Ee Nagaraniki Emaindhi)
Ee Nagaraniki Emaindhi
Ee Nagaraniki Emaindhi : తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 2018 లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో యూత్ ని మెప్పించింది.(Ee Nagaraniki Emaindhi)
నలుగురు ఫ్రెండ్స్ గోవాకి వెళ్ళాలి అనే ఆలోచనతో కామెడీ సినిమాగా ఈ నగరానికి ఏమైంది తెరకెక్కింది. ఈ సినిమాకు కొంతమంది బాగా కనెక్ట్ అయ్యారు. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా బాగానే వసూలు చేసింది. కొన్ని రోజుల క్రితమే ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్ ఈNఈ రిపీట్ కూడా ప్రకటించారు. సృజన యరబోలు నిర్మాణంలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమానుతో పాటు సాయి సుశాంత్ రెడ్డి ప్లేస్ లో శ్రీనాథ్ మాగంటి ని తీసుకొని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ జరగనుంది.
Also Read : NTR : ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎన్టీఆర్.. ఆగిపోయిన డ్రాగన్..? ఆందోళనలో ఫ్యాన్స్
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. ఈ నగరానికి ఏమైంది సినిమా గోవాకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అనే కథతో తెరకెక్కగా ఈ సీక్వెల్ సినిమా థాయిలాండ్ కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అని సస్పెన్స్ కామెడీ కథతో తెరకెక్కిస్తున్నారట. అంతే కాకుండా ఈ సారి బడ్జెట్ కూడా భారీగా పెడుతున్నారు. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం రేంజ్ పెరగడం, థాయిలాండ్ షూటింగ్ కావడంతో రెమ్యునరేషన్స్, ఖర్చులు, బెటర్ అవుట్ ఫుట్ కోసం.. ఇవన్నీ కలుపుకొని ఈసారి ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కి ఆల్మోస్ట్ 40 కోట్లు బడ్జెట్ పెడుతున్నారట.
అంటే పార్ట్ 1 సినిమా కంటే ఏకంగా 20 రెట్లు ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 100 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సిందే. త్వరలోనే షూటింగ్ మొదలయి 2027 లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం. మరి ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ఎలా మెప్పిస్తుందో చూడాలి.
Also See : Hey Bhagawan : సుహాస్ ‘హే భగవాన్’ టీజర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు..
