చరణ్‌తో విభేదాల్లేవు – లేఖ విడుదల చేసిన నిరంజన్ రెడ్డి

చిరంజీవి 152వ చిత్ర నిర్మాణంలో రామ్ చరణ్‌తో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిరంజన్ రెడ్డి..

  • Published By: sekhar ,Published On : March 21, 2020 / 07:48 AM IST
చరణ్‌తో విభేదాల్లేవు – లేఖ విడుదల చేసిన నిరంజన్ రెడ్డి

Updated On : March 21, 2020 / 7:48 AM IST

చిరంజీవి 152వ చిత్ర నిర్మాణంలో రామ్ చరణ్‌తో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిరంజన్ రెడ్డి..

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిరంజన్ రెడ్డి, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి రామ్‌చరణ్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడిగా పెట్టడం లేదని, కేవలం బ్యానర్ మాత్రమే ఇస్తున్నాడని, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థే ఈ సినిమాను నిర్మించి వచ్చిన లాభాల్లో వాటాను మాత్రం చెర్రీకి అందిస్తుందని తాజాగా కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి.

ఈ వార్తలు కాస్తా వైరల్ కావడంతో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తూ.. తమతోపాటు రామ్‌చరణ్ కూడా సమానంగా పెట్టుబడి పెడుతున్నాడని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు నిరంజన్ రెడ్డి ప్రెస్‌నోట్ విడుదల చేశారు.

A press release from Matinee Entertainment Producer Niranjan Reddy about Chiru 152

నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ తమతోపాటు రామ్‌చరణ్ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నారని పేర్కొన్నారు. త్రిష ఇటీవల ఈ సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కథానాయికగా అనుష్క పేరుని పరిశీలిస్తున్నారని, కాజల్ అగర్వాల్ దాదాపు ఫిక్స్ అయినట్లేనని సమాచారం.