Prithviraj makes shocking comments comparing Vilaayath Budha to Pushpa
Vilaayath Budha: మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ సినిమాలకు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే, ఆయన కథల సెలక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నార్మల్ కమర్షియల్ కథలు చేయడానికి ఆయన ఇష్టపడరు. ఎప్పుడు ఎదో ఒక కొత్తదనంతో సినిమాలు చేసి ఆడియన్స్ కి (Vilaayath Budha)మంచి ఫీల్ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. జన గణ మన, లూసీఫార్, ఆయుప్పనుం కోశియుమ్, గోట్ లైఫ్ ఇలా చాలా సినిమాలే ఉన్నాయి. మరోసారి అలాంటి కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు పృథ్వీరాజ్. అదే “విలాయత్ బుద్ధ”.
Raj Tarun: నన్ను తొక్కేయాలనుకున్నారు.. చేతకాక కాదు.. రాజ్ తరుణ్ ఎమోషనల్ కామెంట్స్
ఎర్ర చందనం స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్ తో ఎమోషనల్ డ్రామాగా రానున్న ఈ సినిమాను దర్శకుడు జయన్ నంబియార్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా విలాయత్ బుద్ధ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే, కొంతమంది మాత్రం ఈ సినిమాను అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పోల్చుతున్నారు. పుష్ప సినిమాను కాపీ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ హీరో పృథ్వీరాజ్ వరకు చేరడంతో తాజాగా ఆయన స్పందించాడు.
“చాలా మంది మా సినిమాను పుష్ప తర్వాత స్టార్ట్ చేశాం అనుకుంటున్నారు. కానీ, ఆ అభిప్రాయం పూర్తిగా తప్పు. పుష్ప రిలీజ్‌కు కంటే చాలా కాలం ముందే మా సినిమా మొదలయ్యింది. ఈ సినిమా కథ ‘విలాయత్ బుద్ధ’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ముందు ఈ కథను నాకు అయ్యప్పనుమ్ కోషియుమ్ దర్శకుడు సాచి వినిపించాడు. కానీ, ఆయన అకాల మరణం వల్ల అది ముందుకు సాగలేదు. ఆ తరువాత దర్శకుడు సాచి అసిస్టెంట్ జయన్ నంబియార్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. దానివల్ల ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది. కానీ, మేము ఎవరి సినిమాను కాపీ కొట్టలేదు. దయచేసి మా సినిమాను మరే సినిమాతోనూ కంపేర్ చేయకండి” అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.