Prithviraj Shetty
Prithviraj Shetty : కన్నడ నటుడు పృథ్వీ శెట్టి తెలుగులో సీరియల్స్ తో ఇక్కడ కూడా ఫేమ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సీరియల్స్, టీవీ షోలతో సందడి చేస్తున్నాడు. ఇప్పుడు హీరోగా కన్నడలో ఒక సినిమా కూడా చేస్తున్నాడు.(Prithviraj Shetty)
తాజాగా పృథ్వీ శెట్టి ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో తన తండ్రి గురించి కూడా తెలిపాడు పృథ్వీ.
Also See : Sanjana Galrani : కూతురితో బిగ్ బాస్ సంజన.. టీవీ షోలో సందడి.. ఫొటోలు వైరల్..
పృథ్వీ శెట్టి మాట్లాడుతూ.. మా నాన్న నేను టెన్త్ లో ఉన్నప్పుడు చనిపోయారు. అప్పట్నుంచి మా అమ్మే నన్ను, తమ్ముడ్ని చూసుకుంది. నేను చూసిన స్ట్రాంగ్ వుమెన్ మా అమ్మ. నాకు 22 ఏళ్ళు వచ్చేవరకు కూడా ఆమె కష్టపడి చూసుకుంది. నాన్న చనిపోయిన సమయంలో చాలా కష్టంగా ఉండేది డబ్బులు లేకుండా. అలాంటి లైఫ్ మళ్ళీ రాకూడదు. లైఫ్ లో పేదరికం ఉండకూడదు. డబ్బులు లేకపోతే రెస్పెక్ట్ ఉండదు.
ఆ సమయంలో రిలేటివ్స్ ఫంక్షన్స్ కి వెళ్ళేవాడిని కాదు. వెళ్తే అందరూ ఇంజనీర్, డాక్టర్ అంటే నువ్వు యాక్టింగ్ అని తిరుగుతున్నాడు ఏంటి అని తిట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ మా ఇంటి ఫంక్షన్ కి రమ్మని అడుగుతారు. దేవుడు కనిపిస్తే మా నాన్నని తిరిగిమ్మని అడుగుతా అంటూ ఎమోషనల్ అయ్యాడు.