Prithviraj Sukumaran done a Telugu Movie Before Prabhas Salaar here the Details
Prithviraj Sukumaran : ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో రాబోతున్న సలార్(Salaar) సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 22న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా నటిస్తున్నారు.
మొదటి పార్ట్ లో ప్రభాస్ కంటే పృథ్వీరాజ్ సుకుమారన్ కే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉందని టాక్ కూడా వినిపిస్తుంది. ఆల్రెడీ మలయాళంలో స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ కథ నచ్చి ఈ సినిమాని చేస్తున్నారు. అయితే చాలామంది పృథ్వీరాజ్ కి ఇదే మొదటి తెలుగు సినిమా అనుకుంటున్నారు. కానీ గతంలోనే పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో ఓ సినిమా చేశాడు.
13 ఏళ్ళ క్రితం 2010 లోనే పృథ్వీరాజ్ సుకుమారన్, నటుడు శ్రీరామ్(అలియాస్ శ్రీకాంత్)తో కలిసి తెలుగులో ‘పోలీస్ పోలీస్’ అనే సినిమా చేశారు. ఈ సినిమాలో మల్టీస్టారర్ చేసినా నెగిటివ్ ఛాయలు ఉన్న పాత్ర చేశాడు పృథ్వీరాజ్. మన్మోహన్ చల్ల దర్శకత్వంలో కమిలినీ ముఖర్జీ, సంజన గల్రాని హీరోయిన్స్ గా ఈ సినిమా వచ్చింది. 2010 ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజయింది. ఆ తర్వాత ఈ సినిమాని తమిళ్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. అప్పుడు కూడా ఆ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.
మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సలార్ లో ప్రభాస్ తో కలిసి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పుడు కూడా తెలుగులో పృథ్వీరాజ్ సొంతంగా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు.