Theatrical Release : ఈ వారం థియేటర్స్‌లో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వర్సెస్ హాలీవుడ్.. బాక్సాఫీస్ బద్దలుకొట్టేది ఎవరు?
సలార్, డంకీ సినిమాలు ఇండియాలో భారీ క్లాష్ ఎదుర్కోబోతున్నాయి అనుకుంటే వీటికి పోటీగా ఓ హాలీవుడ్(Hollywood) సినిమా రానుంది.

This Week Indian Box Office Clash with Salaar Dunki and Aquaman and the Lost Kingdom
Theatrical Release : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ నుంచి సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar) సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడి డిసెంబర్ 22న గ్రాండ్ గా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు సలార్ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), జగపతి బాబు(Jagapathi Babu), శ్రియారెడ్డి.. పలువురు స్టార్స్ కీలక పాత్రలను పోషించారు. కన్నడ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ సలార్ సినిమాని నిర్మించింది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఎమోషన్ తో పాటు ఓ యాక్షన్ మూవీగా సలార్ ఉండబోతుంది.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shahrukh Khan) స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో చేసిన సినిమా ‘డంకీ’(Dunki). ఈ సినిమాలో తాప్సి హీరోయిన్ గా నటిస్తుంది. విక్కీ కౌశల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఓ అయిదుగురు ఫ్రెండ్స్ కలిసి లండన్ కి వెల్దామనుకుంటే ఎదురయిన పరిస్థితులు ఏంటి అనే అంశంతో ఈ సినిమా రాబోతుంది. డంకీ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.
సలార్, డంకీ సినిమాలు ఇండియాలో భారీ క్లాష్ ఎదుర్కోబోతున్నాయి అనుకుంటే వీటికి పోటీగా ఓ హాలీవుడ్(Hollywood) సినిమా రానుంది. జాసన్ మోమోవా హీరోగా జేమ్స్ వాన్ దర్శకత్వంలో 2018లో వచ్చిన ఆక్వామెన్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ‘ఆక్వామెన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్'(Aquaman and the Lost Kingdom) సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇండియాలో కూడా ఈ సినిమా సలార్, డంకీలకు పోటీ ఇవ్వనుంది.
దీంతో ఈ వారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ వర్సెస్ హాలీవుడ్ పోటీ సాగనుంది. మరి ఈ పోటీలో ఏ సినిమా ఎన్ని కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందో చూడాలి.