Prithviraj Sukumaran : సలార్ డైలాగ్ లీక్ చేసిన పృథ్విరాజ్ సుకుమారన్.. మాములుగా లేదుగా డైలాగ్..

మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ సలార్ సినిమా పైనుంచి డైలాగ్ లీక్ చేశాడు. దీంతో ఆ డైలాగ్ వైరల్ గా మారింది. పృథ్విరాజ్ సుకుమారన్ సలార్ సినిమాలో వరదరాజమన్నార్ అనే నెగిటివ్ పాత్రలో నటిస్తున్నాడు.

Prithviraj Sukumaran Leak The Dialogue from Salaar Movie

Prithviraj Sukumaran : నేడు ప్రభాస్(Prabhas) పుట్టిన రోజు కావడంతో అభిమానులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రభాస్ సినిమాల నుంచి అప్డేట్స్ ఏమైనా వస్తాయేమో అని అభిమానులు ఎదురు చూసినా నిరాశే మిగిలింది. సలార్(Salaar) సినిమా నుంచి కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కనీసం కొత్త పోస్టర్ అయినా బర్త్ డే విషెస్ చెప్తూ రిలీజ్ చేస్తారు అనుకుంటే అది కూడా లేదు.

కానీ మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ సలార్ సినిమా పైనుంచి డైలాగ్ లీక్ చేశాడు. దీంతో ఆ డైలాగ్ వైరల్ గా మారింది. పృథ్విరాజ్ సుకుమారన్ సలార్ సినిమాలో వరదరాజమన్నార్ అనే నెగిటివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సలార్ సినిమా నుంచి పృద్విరాజ్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

Also Read : Nani 31 : ‘సరిపోదా శనివారం’ అంటున్న నాని.. నాని 31 సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్..

నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ తన సోషల్ మీడియాలో “You brought your armies to the war..I brought him” అనే డైలాగ్ ని పోస్ట్ చేశారు. అంటే ‘యుద్దానికి నువ్వు నీ ఆయుధాల్ని తీసుకొచ్చుకో నేను ఇతన్ని తీసుకొస్తాను’ అని సలార్ గురించి డైలాగ్ పోస్ట్ చేయడంతో ఒక్క డైలాగ్ లోనే సలార్ సినిమా రేంజ్, అందులో ప్రభాస్ కెపాసిటీ ఏంటో చెప్పేశాడు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ప్రభాస్ సలార్ సినిమా 22 డిసెంబర్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.