Nani 31 : ‘సరిపోదా శనివారం’ అంటున్న నాని.. నాని 31 సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్..

DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని – వివేక్ ఆత్రేయ(Vivek Athreya) కాంబోలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య విలన్ గా ఈ సినిమాని అనౌన్స్ చేశారు. తాజాగా సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Nani 31 : ‘సరిపోదా శనివారం’ అంటున్న నాని.. నాని 31 సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్..

Nani 31 under Vivek Athreya Direction Movie Tittle and Glimpse Released

Updated On : October 23, 2023 / 11:21 AM IST

Nani 31 Movie : ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో ప్రేక్షకులని మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు నాని. ఇటీవల యాక్షన్ ఫిలిం దసరా(Dasara) సినిమాతో భారీ హిట్ కొట్టాడు నాని. త్వరలోనే నాని 30వ సినిమా హాయ్ నాన్న అనే క్లాస్ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా రెండు రోజుల క్రితమే నాని 31వ సినిమాని ప్రకటించాడు. నానితో ‘అంటే సుందరానికి’ లాంటి హిలేరియస్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా చేసిన వివేక్ ఆత్రేయతో నాని తన 31వ సినిమాని ప్రకటించాడు.

DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని – వివేక్ ఆత్రేయ(Vivek Athreya) కాంబోలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య విలన్ గా ఈ సినిమాని అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. నాని 31వ సినిమాకు ‘సరిపోదా శనివారం’ అనే వెరైటీ టైటిల్ పెట్టారు. ఇక గ్లింప్స్ రిలీజ్ చేయగా ఇందులో నాని ఇనుప సంకెళ్లతో ఒక పాత గోడౌన్ లో కట్టేసి ఉంటాడు. సాయి కుమార్ వాయిస్ తో ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, ఒక రోజు వస్తుంది అనేలా డైలాగ్ చెప్పించారు. ఆ రోజు హీరోకి ప్రతి శనివారం వస్తుంది అని చెప్పి హీరో ఆ సంకెళ్లని తెంపుకొని బయటకి వస్తాడు. దీంతో ఈ గ్లింప్స్ తోనే సినిమాపై ఆసక్తి పెంచారు.

Also Read : Leo Movie : ఒకే సినిమాకి మూడు క్లైమాక్స్‌లు.. లియో సినిమా ఒక్కో చోట ఒక్కోలా.. ఏంటయ్యా లోకేష్ ఇది?

మరి ప్రతి శనివారం హీరోకి ఏం టైం వస్తుందో చూడాలి. ఈ కథేదో కొత్తగా, యాక్షన్ తో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక రేపు ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్టు సమాచారం. అంటే సుందరానికి సినిమాలో కామెడీ, లవ్ తో మెప్పించిన ఈ కాంబో ఈ సారి యాక్షన్ తో రానున్నారు. ఈసారి ఎలా మెప్పిస్తారో చూడాలి.