Priyadarshi Pulikonda got Swedish International Film Festival Best Actor Award
Priyadarshi Pulikonda : జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా బలగం (Balagam). ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) హీరోహీరోయిన్లుగా కనిపించిన ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని సంచలనం సృష్టించింది. కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు అవార్డులను కూడా అదే రీతిలో సొంతం చేసుకుంటుంది.
Balagam : TS కానిస్టేబుల్ పరీక్షల్లో బలగం సినిమాపై ప్రశ్న.. ఏంటో తెలుసా?
ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎన్నో అవార్డ్స్ ని అందుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డ్రామా మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఇలా పలు అవార్డులను అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో రెండు క్యాటగిరీల్లో అవార్డ్స్ ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో (Swedish International Film Festival) బెస్ట్ యాక్టర్ గా ప్రియదర్శి అవార్డుని గెలుచుకున్నాడు.
Balagam : థియేటర్‌లో ‘బలగం’ బలం ఏమాత్రం తగ్గేదేలే..
ప్రియదర్శితో పాటు ఈ సినిమాలో అతని తాత పాత్ర పోషించిన కేతిరి సుధాకర్ రెడ్డి (Kethiri Sudhakar Reddy ) కూడా అవార్డుని అందుకున్నాడు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ క్యాటగిరీలో సుధాకర్ రెడ్డి అవార్డుని గెలుచుకున్నాడు. కాగా 2021, 22 ఇయర్స్ మలయాళ చిత్రాలు బెస్ట్ ఫిలింగా స్వీడిష్ ఇంటర్నేషనల్ అవార్డుని అందుకుంది. వాటి తర్వాత ఆ లిస్టులో బలగం సినిమా చేరి మొదటి తెలుగు సినిమాగా నిలిచింది. ఇక ఇటీవల ఈ సినిమా సంగీతం దర్శకుడు భీమ్స్ సిసిరోలియో.. 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా 40కి పైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.