Priyanka Chahar Choudhary: బిగ్ బాస్ 16 ఫైనలిస్ట్ ప్రియాంక ఎమోషనల్ జర్నీ.. రియల్ విన్నర్ అంటోన్న ఫ్యాన్స్!

హిందీ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్‌బాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేసే బిగ్‌బాస్ ప్రస్తుతం 16వ సీజన్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. మరికొద్ది రోజుల్లో ఈ సీజన్ కూడా ముగియనుంది. ఫినాలేకు చేరువ కావడంతో, హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌కు తమ జర్నీ గురించిన వీడియోను బిగ్‌బాస్ చూపెట్టాడు. అయితే బిగ్‌బాస్ 16లో ఫినాలేకు చేరిన వారిలో ప్రియాంకా చాహర్ చౌదరి హాట్ ఫేవరేట్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతుంది.

Priyanka Chahar Choudhary Gets Emotional On Her Bigg Boss 16 Journey

Priyanka Chahar Choudhary: హిందీ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్‌బాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేసే బిగ్‌బాస్ ప్రస్తుతం 16వ సీజన్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. మరికొద్ది రోజుల్లో ఈ సీజన్ కూడా ముగియనుంది. ఫినాలేకు చేరువ కావడంతో, హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌కు తమ జర్నీ గురించిన వీడియోను బిగ్‌బాస్ చూపెట్టాడు. అయితే బిగ్‌బాస్ 16లో ఫినాలేకు చేరిన వారిలో ప్రియాంకా చాహర్ చౌదరి హాట్ ఫేవరేట్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతుంది.

Bigg Boss 7: బిగ్‌బాస్ 6 ముగిసింది.. ఇక బిగ్‌బాస్ 7 లొల్లి షురూ..?

ఆమె బిగ్‌బాస్ జర్నీకి సంబంధించిన వీడియోను ఆమెకు చూపెట్టాడు బిగ్‌బాస్. ఈ జర్నీ వీడియోను చూసి ప్రియాంకా ఎమోషనల్ అయ్యింది. అటు బిగ్‌బాస్ కూడా ప్రియాంకా జర్నీతో ఎమోషనల్‌గా మాట్లాడాడు. బిగ్‌బాస్ సీజన్ 16 గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా, ఖచ్చితంగా ప్రియాంకా చాహర్ పేరు గుర్తుకు వస్తుందని బిగ్‌బాస్ స్వయంగా తెలపడం.. ఆమె ఈ సీజన్‌లో ఎలాంటి ఫేం సాధించిందనే దానికి ఉదాహరణగా చెప్పాలి.

ఇక ప్రియాంకాకు ఈ బిగ్‌బాస్ 16 కారణంగా అభిమానుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ఈ సీజన్‌లో ఖచ్చితంగా ప్రియాంకా విన్నర్‌గా నిలుస్తుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. అంతేగాక కామన్ ఆడియెన్స్ కూడా ఆమె జర్నీ చూసి రియల్ విన్నర్ ప్రియాంకా అంటున్నారు. మరి బిగ్‌బాస్ 16 విన్నర్‌గా ప్రియాంకా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.