Priyanka Jawalkar: నాలో వచ్చిన మార్పులు నాకే తెలియదు!

తెలుగు హీరోయిన్స్ రావడం చాలా తక్కువగా వస్తున్నారని వింటుంటాం. అందునా నార్త్ ముద్దుగుమ్మలకు పోటీ ఇచ్చే అందంతో తెలుగు భామలు దొరకడం కష్టంగా మారింది. అయితే.. ప్రియాంకా జవల్కర్ ను చూస్తే తెలుగు హీరోయిన్స్ లో కూడా ఇంత అందం ఉంటుందా అనిపిస్తుంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రియాంకా కలవరమాయే అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

Priyanka Jawalkar: నాలో వచ్చిన మార్పులు నాకే తెలియదు!

Priyanka Jawalkar

Updated On : August 11, 2021 / 7:42 AM IST

Priyanka Jawalkar: తెలుగు హీరోయిన్స్ రావడం చాలా తక్కువగా వస్తున్నారని వింటుంటాం. అందునా నార్త్ ముద్దుగుమ్మలకు పోటీ ఇచ్చే అందంతో తెలుగు భామలు దొరకడం కష్టంగా మారింది. అయితే.. ప్రియాంకా జవల్కర్ ను చూస్తే తెలుగు హీరోయిన్స్ లో కూడా ఇంత అందం ఉంటుందా అనిపిస్తుంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రియాంకా కలవరమాయే అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాలో నటించినా.. కొత్తగా అవకాశాలు అందుకోవడంలో మాత్రం వెనకపడింది. దీంతో కాస్త ఆలస్యంగానైనా ఇప్పుడు ఆఫర్ల వేట మొదలుపెట్టింది. హాట్ ఫోటోలతో తనపై ఇండస్ట్రీ దృష్టి పడేలా చేసుకుంటున్న ప్రియాంకా కరోనా లాక్ డౌన్ తర్వాత ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రియాంకా నటించిన తిమ్మరుసు, ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలు ఇప్పుడు థియేటర్లలోనే ఉన్నాయి.

ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఈ భామ.. నిజమే నేను ఆ మధ్య కాస్త బరువు పెరిగిన మాట నిజమేనని.. అయితే నాలో వచ్చిన ఆ మార్పుల ఎలా వచ్చాయో నాకే అర్ధం కాలేదని చెప్పుకొచ్చింది. థైరాయిడ్, ఇన్సులిన్‌ రెసిస్టెన్సీ సమస్యల వలెనే బరువు పెరిగానని.. డాక్టర్స్‌ సలహాలతో ఫుడ్, వ్యాయామంతో మళ్ళీ బరువు తగ్గానని చెప్పుకొచ్చింది.