Lady Producers
Lady Producers: సినిమా నిర్మాణమంటేనే కోట్ల రూపాయలతో కూడిన వ్యవహారం.. అన్నిటికీ మించి తీవ్ర ఒత్తిడితో నిర్వహించాల్సిన పని. అందుకే పెద్దపెద్ద సంస్థలే సినిమా నిర్మాణంలో నేర్పుగా ముందుకు సాగుతూ విజయాలను అందుకుంటున్నాయి. మరికొందరు స్టార్ ప్రొడ్యూసర్స్, హీరోలు కూడా నిర్మాణ రంగంలో రాణిస్తుండగా బాలీవుడ్ లో లేడీ ప్రొడ్యూసర్స్ కూడా హవా కొనసాగిస్తుంటారు. వరల్డ్ స్టార్ గా ఎదిగిన ప్రియాంకా చోప్రా నుండి ఇప్పుడే నిర్మాణంలో అడుగుపెట్టిన తాప్సీ వరకు బాలీవుడ్ లో లేడీ ప్రొడ్యూసర్స్ మగవాళ్ళతో ధీటుగా పనిచేస్తున్నారు. అలా కోట్లాది రూపాయల వ్యాపారంతో ప్రొడక్షన్ హౌస్‌లను నడుపుతున్న 9 మంది బాలీవుడ్ హీరోయిన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Taapsee Pannu
Lady Producers (1)
కొద్ది రోజుల క్రితం, తాప్సీ పన్నూ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తన కొత్త ప్రొడక్షన్ హౌస్ ‘అవుట్‌సైడర్స్ ఫిల్మ్స్’ను ప్రకటించడంతో ఇండియన్ సినీ పరిశ్రమలో ఆసక్తిగా మారింది. నిర్మాణ రంగంలో 20 సంవత్సరాల అనుభవమున్న ప్రంజల్ ఖండ్డియాతో కలిసి తాప్సీ ఇది మొదలుపెట్టారు. సూపర్ 30, 83, పికు వంటి ప్రసిద్ధ చిత్రాల నిర్మాణంలో భాగమైన ఖండ్డియా ఇప్పుడు తాప్సీతో కలిసి వారి కొత్త ప్రొడక్షన్ హౌస్ కింద బ్లర్ అని పేరుతో మొదటి ప్రాజెక్టును కూడా ప్రకటించారు.
2. Priyanka Chopra
Lady Producers (2)
బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తన హవా కొనసాగిస్తున్న ప్రియాంక చోప్రా నిర్మాతగా కూడా అదే స్థాయిలో దూసుకుపోతున్నారు. ప్రియాంక చోప్రా ఆమె తల్లి డాక్టర్ మధు చోప్రాతో కలిసి పర్పుల్ పెబుల్ పిక్చర్స్ పేరుతో ముంబై, లాస్ ఏంజెల్స్ లో ఒకేసారి 2015లో టెలివిజన్ స్టూడియో ప్రారంభించారు.
3. Anushka Sharma
Lady Producers (3)
అనుష్క శర్మ, ఆమె సోదరుడు కర్నేశ్ శర్మతో కలిసి అక్టోబర్ 2013లో క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ స్థాపించగా.. ఇది వారికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఓటీటీ ప్రపంచంలో పాటల్ లోక్ వంటి విజయవంతమైన సిరీస్ తో పాటు నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి నిర్మించిన హర్రర్ ఫిల్మ్ బుల్బుల్‌తో వారి ప్రొడక్షన్ హౌస్ విజయవంతమైంది.
4. Deepika Padukone
Lady Producers (4)
దీపికా పదుకొనే నిర్మాణ భాగస్వామ్యం అందించే కెఎ ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పితో పాటు, కెఎ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్‌ను కూడా కలిగి ఉంది. 2018లో కెఎ ఎంటర్టైన్మెంట్ నిర్మించి దీపిక నటించిన ఛపాక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకోగా ముందుముందు కూడా దీపికా నిర్మాణ రంగంలో మరింత ముందుకెళ్లాలని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.
5. Twinkle Khanna
Lady Producers (5)
ట్వింకిల్ ఖన్నా తన భర్త అక్షయ్ కుమార్ తో కలిసి హరి ఓం ఎంటర్టైన్మెంట్ సహ యజమానిగా ఉన్నారు. అక్షయ్ సినిమాలలో సహా భాగస్వామిగా నిర్మాణంలో భాగమయ్యే మరో రెండు అనుబంధ సంస్థలు కేప్ అఫ్ గుడ్ హోప్ ఫిలిమ్స్, గ్రేజింగ్ గోట్ ఫిలిమ్స్ కూడా ఈ జంట కలిగి ఉన్నారు.
6. Dia Mirza
Lady Producers (6)
దియా మీర్జా పదేళ్ల క్రితమే సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టగా బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఆమె సినిమాలను నిర్మిస్తున్నారు. 2011లో లవ్ బ్రేకప్స్ జిందగీతో మొదలైన దియా నిర్మాణం 2014లో విద్యాబాలన్ నటించిన బాబీ జాసూస్ తో భారీ సక్సెస్ అందుకుంది. ఈ మధ్యనే మైండ్ ది మల్హోత్రాస్ అనే ఓటీటీ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
7. Madhuri Dixit
Lady Producers (7)
మాధురి దీక్షిత్ ఆర్ఎన్ఎమ్ మూవింగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ కలిగి ఉండగా.. ఒక అంతర్జాతీయ ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా పర్పుల్ పెబుల్ పిక్చర్స్‌తో కలిసి పనిచేయగా మరాఠీ సినిమా బకెట్ లిస్ట్‌ను కూడా నిర్మించింది.
8. Chitrangadha Singh
Lady Producers (8)
చిత్రంగధ సింగ్ ఆమె పేరులోని ఎక్రోనింస్‌ని ఉపయోగించి సిఎస్ ఫిల్మ్స్‌ను ప్రారంభించగా.. సోనీ నెట్‌వర్క్ పిక్చర్స్‌తో కలిసి సూర్మ పేరుతో ఓ సినిమాను నిర్మించారు.
9. Tisca Chopra
Lady Producers (9)
టిస్కా చోప్రా ఫుర్సాట్ ఫిల్మ్స్, ఎల్‌ఎల్‌పి పేరుతో నిర్మాణ సంస్థను నడుపుతుండగా.. ఈ ప్రొడక్షన్ హౌస్ కింద నిర్మించిన హెల్మింగ్ చట్నీ అనే షార్ట్ ఫిల్మ్ తో సక్సెస్ సాధించారు.