Site icon 10TV Telugu

Dheeraj Mogilineni : అమలాపురం వచ్చి మరీ బెదిరించి షూటింగ్ ఆపేసారు.. దౌర్జన్యం చేస్తున్నారు..

Producer Dheeraj Mogilineni Tells how Film Federation and Some Union Members looted their Money

Dheeraj Mogilineni

Dheeraj Mogilineni : టాలీవుడ్ లో ఫిలిం ఫెడరేషన్ ఏకంగా 30 శాతం వేతనాలు పెంచితే తప్ప కార్మికులను షూటింగ్స్ కి వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉన్నపళంగా ఎలాంటి నోటీసులు లేకుండా షూటింగ్స్ ఆపేయడంతో నిర్మాతలకు చాలా నష్టం వచ్చింది అని వాపోతున్నారు. టాలీవుడ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, నష్టాల్లో అంత పెంచలేం కావాలంటే 15 శాతం వరకు పెంచుతామన్నా ఫెడరేషన్ ఒప్పుకోవట్లేదు.

దీంతో చిన్న నిర్మాతలు అంతా కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి యూనియన్స్, ఫెడరేషన్ పేరుతో కొంతమంది చేస్తున్న దౌర్జన్యాలు, నిర్మాతలను వాళ్ళు ఎలా దోచుకుంటున్నారో అని అందరూ వాళ్ళు ఫేస్ చేసిన ఇబ్బందులను చెప్పారు.

Also Read : Upasana : అత్తామామల గురించి ఉపాసన ఏం చెప్పిందంటే? సురేఖ ఇచ్చిన సలహా ఇదే.. ఆ విషయంలో చిరు, ఉపాసన ఒకటే..

ఈ క్రమంలో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. మేం అమలాపురంలో ‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కార్పెంటర్ అవసరం అయింది. మేము మాట్లాడుకున్న యూనియన్ అతను ఏదో పని ఉండి హైదరాబాద్ నుంచి రాలేదు. అతను రావడం ఆలస్యం అవుతుంది షూటింగ్ ఆగకూడదు అని అక్కడే ఒక లోకల్ కార్పెంటర్ ను పెట్టుకుంటే కొంతమంది హైదరాబాద్ నుండి వచ్చి మరీ బెదిరించి ఒకరోజంతా షూటింగ్ ఆపించారు. ఒక రోజు సెట్లో వంద మంది ఖాళీగా ఉన్నారు అయినా నేను వాళ్లకు ఫుడ్ పెట్టాలి, వేతనాలు ఇవ్వాలి. అదంతా నాకే కదా నష్టం అంటూ ఫైర్ అయ్యారు.

అలాగే.. యూనియన్స్ పేరుతో మాకు భారాన్ని పెంచవద్దని కోరుతున్నాం. ఈ యూనియన్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి నిబంధనలు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మార్చాలి. తక్కువ మందితో సరిపోయే షూటింగ్ లో 100, 150 మందిని పెట్టాలని దౌర్జన్యం చేస్తున్నారు. ఒక సెట్ కోసమో, ఇంకో క్వాలిటీ కోసమే మేము పెట్టాల్సిన ఖర్చు ఇలా వృథా అవుతోంది. ఈ బంద్ ల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు అని అన్నారు.

Also Read : Amardeep : గోవాలో రాత్రంతా నేను తాగి పడిపోతే.. సుప్రీత వచ్చి..

మరో నిర్మాత మధుర శ్రీధర్ కూడా ఇదే విషయం చెప్తూ.. నాకు షూటింగ్ కి పదిమంది సరిపోతారు కానీ యూనియన్ రూల్స్ అంటూ ఓ 50 మందిని తెస్తున్నారు. నాకు అవసరం లేకపోయినా వాళ్లందరికీ వృధాగా డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అని తాను ఫేస్ చేసిన ఇబ్బందులను తెలిపారు. ఇలా చిన్న నిర్మాతలు అంతా యూనియన్స్ పేరుతో కొంతమంది చేస్తున్న దౌర్జన్యాలను బయటపెట్టారు. దీంతో షూటింగ్ కి ఎంతమంది అవసరం అయితే అంతేమందిని పెట్టుకోవాలి కదా, ఎక్కువ మందిని ఎందుకు పెట్టుకోవాలి అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

Also Read : ఎలా సినిమాలు తీయాలి? మా భవిష్యత్ ఏంటి? మా రిటర్న్స్ ఏంటి? మేం బతకాలా? చావాలా?: నిర్మాత ఎస్‌కేఎన్‌

Exit mobile version