Amardeep : గోవాలో రాత్రంతా నేను తాగి పడిపోతే.. సుప్రీత వచ్చి..
తాజాగా అమర్ దీప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.

Amardeep
Amardeep : సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అమర్ దీప్ చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సురేఖావాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా నటిస్తుంది. సుప్రీత ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.
ఆ సినిమా షూటింగ్ లో అమర్ దీప్, సుప్రీత మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తాజాగా అమర్ దీప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.
అమర్ దీప్ మాట్లాడుతూ.. సుప్రీత ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్. ఇద్దరం బాగా మాట్లాడుకుంటాం. వర్క్ విషయంలో సజెషన్స్ తీసుకుంటాం. షూటింగ్ సమయంలో క్లోజ్ అయ్యాం. అప్పుడప్పుడు సిట్టింగ్స్ కి కూర్చుంటాము. ఒకసారి గోవాకి వాళ్ళ ఫ్రెండ్స్ తో తను, నా ఫ్రెండ్స్ తో నేను ఇద్దరం సపరేట్ గా అనుకోకుండా వెళ్ళాం. ఇద్దరం అక్కడ కలిసాము. గోవాలో రాత్రంతా నేను తాగి పడిపోతే తెల్లారి 9 గంటలకు సుప్రీత నన్ను నా రూమ్ దగ్గర డ్రాప్ చేసింది. సుప్రీత వాళ్ళ అమ్మ సురేఖవాణి అక్క కూడా నాకు బాగా దగ్గరైంది. నన్ను కూడా బాగా కేర్ చేస్తుంది అని తెలిపాడు.