Dil Raju : వాళ్ళిద్దర్నీ కలుపుతున్న దిల్ రాజు.. ఈసారి మరింత భారీగా..?

బన్నీకి డిమాండ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. సౌత్ స్టార్ డైరెక్టర్లతో పాటు ప్రొడ్యూసర్లు మాతో సినిమా చెయ్యండంటే మాతో సినిమా చెయ్యండంటూ వెంటపడుతున్నారు.

Producer Dil Raju Planning Movie with Allu Arjun and Prasanth Neel

Dil Raju : పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీకి డిమాండ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. సౌత్ స్టార్ డైరెక్టర్లతో పాటు ప్రొడ్యూసర్లు మాతో సినిమా చెయ్యండంటే మాతో సినిమా చెయ్యండంటూ వెంటపడుతున్నారు. అలా అట్లీతో, త్రివిక్రమ్ తో, సందీప్ రెడ్డి వంగతో సినిమా లైనప్ చేసుకున్నబన్నీకి కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా సెట్ చేస్తున్నారు తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.

అల్లు అర్జున్ ఇప్పుడు మోస్ట్ డిమాండింగ్ స్టార్ హీరో. పుష్ప 2తో దాదాపు 1850 కోట్లు రాబట్టిన బన్నీతో సినిమా అంటే ప్రొడ్యూసర్లు కూడా ఎగిరి గంతేస్తున్నారు. అంతేకాదు ఎంత ఖర్చైనా పెట్టి సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే బన్నీ కలెక్షన్ల స్టామినా అలాంటిది. అలా వరసగా హిట్లతో ఉన్న బన్నీకి, బ్లాక్ బస్టర్ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన ప్రశాంత్ నీల్ కి సినిమా సెట్ చేసే పనిలో బిజీగా దిల్ రాజు ఉన్నారని టాక్.

Also Read : Rajamouli : దెబ్బకి అక్కడ షూటింగ్ క్యాన్సిల్ చేసి.. సెట్ వేద్దామని ఫిక్స్ అయ్యాడట రాజమౌళి..

కంటెంట్ విషయంలోనే కాదు కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలో కూడా కాలిక్యులేటెడ్ గా ఉండే దిల్ రాజు అసలే బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్నారు. ఖుషి, గేమ్ ఛేంజర్ లతో బాగా దెబ్బ పడింది దిల్ రాజుకి. ఇలాంటి టైమ్ లో సాలిడ్ హిట్ వస్తేనే కానీ దిల్ రాజు కోలుకునే పరిస్తితి లేదు. అందుకే హిట్ మెషీన్స్ అయిన ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా చేస్తే కలెక్షన్లతో పాటు బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం అనుకుంటున్నారు. దాంతో ఎలా అయినా ప్రశాంత్ నీల్ కి, బన్నీకి మీటింగ్ సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట దిల్ రాజు.

ప్రశాంత్ నీల్ మేకింగ్, ఎలివేషన్ కి పాన్ ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. ఇక బన్నీ సంగతి చెప్పక్కర్లేదు. వరసగా చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. వీటికి తోడు లాస్ట్ ఇయర్ రిలీజైన పుష్ప 2 అయితే బాలీవుడ్ లో ఉన్న రికార్డుల్ని తుడిచిపెట్టేసి పాన్ వరల్డ్ హీరోని చేసేసింది. అందుకే ఈ ఇద్దరినీ సెట్ చేసి సినిమా చేస్తే ఇక తిరుగుండదనుకుంటున్నారట దిల్ రాజు.

Also Read : Sapthagiri : ‘సప్తగిరి’ అసలు పేరేంటో తెలుసా? పేరు మార్పు వెనక వేంకటేశ్వరస్వామి ఉన్నారట.. స్టోరీ ఇంట్రెస్ట్ గానే ఉంది..

అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సలార్ 2 సినిమా చేయనున్నారు. ఒకవేళ బన్నీతో సినిమా సెట్ అయినా ఆ రెండుకి సినిమాల తర్వాతే ఉండొచ్చు. మరి దిల్ రాజు ప్లాన్ వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కి మాత్రం పండగే.