Producer Naga Vamsi Comments on Devara Movie Mid Night Shows
Naga Vamsi : స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ రోజుకు ముందు రోజే అర్ధరాత్రి, తెల్లవారు జామున షోలు వేస్తారని తెలిసిందే. అయితే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు కూడా మిడ్ నైట్ షోలు వేశారు. దీనిపై నిర్మాత నాగవంశీ ఆ సినిమా సమయంలో మాట్లాడుతూ.. మిడ్ నైట్ షోలు వేయడం వల్లే కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మిడ్ నైట్ షోలు వేయడం కరెక్ట్ కాదేమో, మేము ఆ తప్పు చేసాము అని అన్నారు. అయితే ఇటీవల దేవర సినిమాకు కూడా మిడ్ నైట్ షోలు వేశారు. తాజాగా నాగవంశీ దీనిపై కూడా స్పందించారు.
Also Read : Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ అప్డేట్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..
నిర్మాత నాగవంశీ లక్కీ భాస్కర్ సినిమా ప్రెస్ మెట్ లో పాల్గొనగా మీడియా ముందు దేవర మిడ్ నైట్ షోల గురించి ప్రస్తావన రాగా.. దేవర సినిమాకు మంచి లాభాలు వచ్చాయి. దేవర అర్థరాత్రి షోలు వేయడం వల్ల నాకో విషయం అర్థమైంది. అర్థరాత్రి షోలకు వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా, సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. లక్కీ భాస్కర్ సినిమాకు అర్థరాత్రి షోలు కాకుండా, ముందురోజు సాయంత్రం నుంచే షోలు వేస్తున్నాము అని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.