×
Ad

Lenin: ‘లెనిన్’ మూవీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. అవుట్ ఫుట్ అదుర్స్ అంట..

అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ 'లెనిన్(Lenin)'. దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Producer Naga Vamsi gave an update about Akhil Akkineni's Lenin movie.

Lenin: అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రా అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్ లో లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలో ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ, ఆమె ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న కారణంగా ఆమె ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సే తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Ashu Reddy: ఆషు రెడ్డి పరువాల విందు.. చూస్తే మైండ్ బ్లాకే.. ఫోటోలు

నిజానికి ఈ సినిమాపై చాలా ఆశలే పట్టుకున్నాడు అఖిల్. ఆయన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. మధ్యలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఒకటి సో సో గా ఆడింది. ఆ తరువాత భారీ బడ్జెట్ తో చేసిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు అఖిల్. చాలా గ్యాప్ తరువాత లెనిన్ సినిమాను మొదలుపెట్టాడు. అక్కినేని ఫ్యాన్స్ కూడా లెనిన్(Lenin) సినిమాపై చాలా ఆశలే పట్టుకున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా లెనిన్ సినిమాపై నిర్మాత నాగ వంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన లెనిన్ సినిమా గురించి మాట్లాడుతూ.. “లెనిన్ సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వస్తోంది. చాలా హ్యాపీగా ఉన్నాము. లెనిన్ తో అఖిల్ భారీ హిట్ సాధించడం ఖాయం. ఆలాగే, ఈ సినిమాలో ఒక హీరోయిన్ స్పెషల్ రోల్ చేస్తోంది. అది మాత్రం ఆడియన్స్ కి సర్ ప్రైజ్” అంటూ చెప్పుకొచ్చాడు నాగ వంశీ. దీంతో లెనిన్ సినిమాపై నాగ వంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే అక్కినేని ఫ్యాన్స్ సైతం నాగ వంశీ చేసిన ఈ కామెంట్స్ పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అఖిల్ అక్కినేని బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.