Vijay Devarakonda : విజయ్ VD12 మూవీ పరిస్థితి ఏంటి..? నిర్మాత నాగవంశీ ఏమన్నారు..!

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి VD12 మూవీ పరిస్థితి ఏంటి..? నిర్మాత నాగవంశీ ఆ సినిమా గురించి ఏమన్నారు..?

Producer naga vamsi gave clarity on Vijay Devarakonda VD12 movie

Vijay Devarakonda : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించబోతున్నారు. ఇక విజయ్ కి హీరోయిన్ గా శ్రీలీలని కూడా ఎంపిక చేసుకున్నారు. పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లాంచ్ అయిన ఈ చిత్రం.. ఇప్పటివరకు షూటింగ్ కి మాత్రం వెళ్ళలేదు.

ఇది ఇలా ఉంటే.. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నాగవంశీ నిర్మాణంలో ‘మ్యాజిక్’ అనే మ్యూజికల్ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అంతా కొత్త వారితో ఈ సినిమా రూపొందుతుంది. సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆడియన్స్ లో ఓ సందేహం మొదలయింది.

Also read : Hanuman OTT : హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆ పండక్కే.. ఎప్పుడో తెలుసా? ఏ ఓటీటీలోకి?

విజయ్, గౌతమ్ కాంబినేషన్ లో ప్రకటించిన VD12 సినిమా ఏమైంది..? అది ఆగిపోయిందా..? అనే సందేహం మొదలయింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నాగవంశీని ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ.. ‘ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్ పూర్తి అయిన తరువాత VD12 మొదలవుతుంది’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్యామిలీ స్టార్, మ్యాజిక్ సినిమాలు సమ్మర్‌కే షూటింగ్ పూర్తి చేసుకుంటాయి.

దీంతో విజయ్, గౌతమ్ ఇద్దరు ఫ్రీ అవుతారు. సమ్మర్ లోనే VD12 పట్టాలు ఎక్కుతుంది. కాగా ఈ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమాని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నారని సమాచారం. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. విజయ్ అభిమానులు అయితే ఆ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.