Hanuman OTT : హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆ పండక్కే.. ఎప్పుడో తెలుసా? ఏ ఓటీటీలోకి?

హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం పలువురు ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం..

Hanuman OTT : హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆ పండక్కే.. ఎప్పుడో తెలుసా? ఏ ఓటీటీలోకి?

Prashanth Varma Teja Sajja Hanuman Movie OTT Releasing Details

Updated On : January 29, 2024 / 2:24 PM IST

Hanuman OTT : ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా తెరకెక్కిన హనుమాన్ సినిమా ఇటీవల సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కలెక్షన్స్ లో అయితే ఈ సినిమా అన్ని ఏరియాలలో దూసుకుపోతుంది. ఇప్పటికే హనుమాన్ సినిమా 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి వసూళ్ళలో అదరగొడుతుంది. సినిమా రిలీజయి 15 రోజులు దాటుతున్నా ఇంకా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.

Also Read : Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ సినిమా పక్కన పెట్టి.. ‘మ్యాజిక్’ అంటూ చిన్న సినిమాతో వస్తున్న డైరెక్టర్..

ఇక హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం పలువురు ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం హనుమాన్ సినిమా జీ5 ఓటీటీలో మార్చ్ రెండో వారం నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. మార్చ్ 8 శివరాత్రి ఉండటంతో ఆ రోజు నుంచి హనుమాన్ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది. హనుమాన్ సినిమాకి ఇంకా థియేటర్స్ కి జనాలు ఫుల్ గా వస్తుండటంతో అప్పటికి 50 డేస్ కూడా పూర్తిచేసుకొని ఇంకో రికార్డ్ సెట్ చేయాలని చూస్తుంది. థియేటర్స్ లో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ సాధించిన హనుమాన్ ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు కొడుతుందో చూడాలి.