Deavara – Naga Vamsi : అనవసరమైన ఫ్యాన్ వార్స్ ఇకనైనా ఆపండి.. దేవర రిలీజ్ కి ముందు నిర్మాత ట్వీట్ వైరల్..

దేవర సినిమాని రిలీజ్ చేస్తున్న నిర్మాత నాగ వంశీ ఫ్యాన్ వార్స్ పై ఆసక్తికర ట్వీట్ చేసారు.

Producer Naga Vamsi Interesting Tweet on Fan Wars Before Devara Release

Deavara – Naga Vamsi : ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో మామూలుగానే ఫ్యాన్ వార్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఇక స్టార్ హీరోల సినిమాల సమయంలో ఈ ఫ్యాన్ వార్స్ మరింత జరుగుతాయి. అలాగే సినిమా రిలీజ్ రోజే కొంతమంది థియేటర్లో సినిమాలోని హైలెట్ సీన్స్ ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ రెండు అంశాలపై స్పందిస్తూ దేవర సినిమాని రిలీజ్ చేస్తున్న నిర్మాత నాగ వంశీ ఆసక్తికర ట్వీట్ చేసారు.

నాగవంశీ తన ట్వీట్ లో.. తారక్ అన్న చాలా గ్యాప్ తర్వాత మంచి ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్నారు. మంచి కంటెంట్ మనకు ఇవ్వడానికి ఆయన కష్టం ఆయన పడ్డారు. మా వైపు నుంచి మేము మంచి రిలీజ్ చేస్తున్నాం. ఏపీలో బెనిఫిట్ షోలు చాలా ఏళ్ళ తర్వాత వేస్తున్నాము ప్రభుత్వ సహకారంతో. మా సిన్సియర్ రిక్వెస్ట్ మీరు కూడా బాధ్యతగా, ప్రశాంతంగా ఉండండి. అక్కరలేని ఫ్యాన్ వార్స్ సృష్టించడం ఆపేయండి. ఫ్యాన్ వార్స్ వల్ల మన సినిమా మీదే నెగిటివిటిని మనమే ఆహ్వానిస్తున్నాము. ఫ్యాన్ వార్స్ తాత్కాలిక ఆనందం ఇవ్వొచ్చు. కానీ ఇవి మన సినిమాను దెబ్బ తీస్తున్నాయి. కాబట్టి అందరి ఫ్యాన్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఫ్యాన్ వార్స్ ని ఆపేయండి. ఈ సినిమాతో అయినా సినిమాలపై నెగిటివిటి ప్రచారం చేయమని, ఫ్యాన్ వార్స్ ఆపుతామని ప్రమాణం తీసుకోండి అని అన్నారు.

Also Read : NTR – America : హాలీవుడ్ స్టేజిపై ఎన్టీఆర్.. ‘దేవర’ గురించి అమెరికా ఫిలిం ఫెస్ట్‌లో చెప్తున్న తారక్.. ఫొటో వైరల్..

అలాగే.. సినిమాని ముందుగా చూసే ఫ్యాన్స్ సినిమాని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆపండి. మీ పక్కన కూర్చున్న వాళ్ళని కూడా వీడియోలు తీయనివ్వకండి. మీ తర్వాత చూసే ఫ్యాన్స్ కి ఆ థ్రిల్ ఉంచండి. ప్రేమతో తారక్ అన్నకు పెద్ద బ్లాక్ బస్టర్ ఇద్దాం. దేవర సెప్పిండు అంటే సేసినట్టే అని రాసుకొచ్చారు. దీంతో నిర్మాత నాగవంశీ ట్వీట్ వైరల్ గా మారింది. అయితే నాగవంశీ చెప్పినవన్నీ నిజాలే అని పలువురు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ ఇప్పటికైనా ఆ ఫ్యాన్ వార్స్ ఆపుతారా చూడాలి.