NTR – America : హాలీవుడ్ స్టేజిపై ఎన్టీఆర్.. ‘దేవర’ గురించి అమెరికా ఫిలిం ఫెస్ట్‌లో చెప్తున్న తారక్.. ఫొటో వైరల్..

బియాండ్ ఫెస్ట్ లో దేవర సినిమాని ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ ఆల్రెడీ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.

NTR – America : హాలీవుడ్ స్టేజిపై ఎన్టీఆర్.. ‘దేవర’ గురించి అమెరికా ఫిలిం ఫెస్ట్‌లో చెప్తున్న తారక్.. ఫొటో వైరల్..

NTR at Beyond Fest Los Angeles for Devara Promotions Photo goes Viral

Updated On : September 25, 2024 / 12:06 PM IST

NTR – America : ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో భాగంగా అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికా లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ లో దేవర ఫస్ట్ షో పడనుంది. ఈ క్రమంలో బియాండ్ ఫెస్ట్ లో దేవర సినిమాని ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ ఆల్రెడీ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.

Also Read : Soniya – RGV : బిగ్ బాస్ సోనియాకు సపోర్ట్ గా ఆర్జీవీ పోస్ట్.. సోనియాతో దిగిన ఫోటో షేర్ చేసి..

తాజాగా బియాండ్ ఫెస్ట్ అధికారిక అకౌంట్ లో ఎన్టీఆర్ అక్కడ స్టేజిపై మాట్లాడుతున్న ఫొటో షేర్ చేసి.. ఐకాన్ ఎన్టీఆర్ ఇక్కడికి వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు, తన దేవర సినిమా గురించి మాట్లాడారు అని తెలిపారు. దీంతో ఈ ఫొటో వైరల్ అయింది. ఎన్టీఆర్ అక్కడ స్టేజిపైకి వెళ్లగా ఆడియన్స్ నుంచి అరుపులు, చప్పట్లతో మంచి స్పందన వచ్చింది.

Image

RRR తర్వాత మరోసారి హాలీవుడ్ ఫిలిం ఫెస్ట్ లో స్టేజిపై ఎన్టీఆర్ మాట్లాడుతుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఎన్టీఆర్ స్పీచ్ ల కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.