Producer Nagavamsi Donated Huge Amount to TDP Party CM Chandrababu Naidu Anouunce in Mahanadu
TDP Mahanadu : ప్రస్తుతం ఏపీలో టీడీపీ మహానాడు ఘనంగా జరుగుతుంది. గత రెండు రోజుల నుంచి కడపలో జరుగుతున్న మహానాడు నేడు ఆఖరు రోజు. నేడు మహానాడు సభకు దాదాపు 5 లక్షలమందికి పైగా కార్యకర్తలు, టీడీపీ అభిమానులు హాజరయ్యారు. మహానాడులో టీడీపీకి భారీ విరాళాలు ఇచ్చిన వారి పేర్లను స్వయంగా చంద్రబాబు చదివి వినిపించారు.
Also Read : Sarkaar : ‘సర్కార్’ మళ్ళీ వచ్చేస్తున్నాడు.. మరోసారి సుడిగాలి సుధీర్ ఎంటర్టైన్మెంట్..
ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి సితార ఎంటర్టైన్మెంట్స్ తరపున నిర్మాత నాగవంశీ భారీ విరాళం ఇచ్చినట్టు తెలిసింది. చంద్రబాబు స్వయంగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు 25 లక్షల రూపాయలు టీడీపీకి విరాళం ఇచ్చినట్టు ప్రకటించారు. మొత్తం ఈ సంవత్సరం 22 కోట్ల 28 లక్షల రూపాయలు విరాళాలు పార్టీకి వచ్చాయని తెలిపారు. నిర్మాత నాగవంశీ 25 లక్షలు విరాళం ఇచ్చారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ కార్యకర్తలు ఆయన్ని అభినందిస్తున్నారు.
THANK YOU @vamsi84 Anna For Donating 25 Lakhs To The Telugu Desam Party 💛#Mahanadu #NagaVamsi pic.twitter.com/nD384M6kVg
— CBN FOR BETTER NATION (@ncbnclut) May 27, 2025