Gaddar Awards : తెలంగాణ గద్దర్ అవార్డుల్లో అదరగొట్టిన లక్కీ భాస్కర్, కల్కి, 35 ఇది చిన్నకథ కాదు.. ఏయే సినిమాకు ఎన్ని అవార్డులు..
2024 లో రిలీజయిన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు.

Lucky Bhaskhar Kalki 2898AD 35 Idi Chinna Katha Kadu Razakar Movies gets More Awards in Telangana Gaddar Awards
Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు FDC చైర్మన్ దిల్ రాజు, జయసుధ నేతృత్వంలోని జ్యురి 2024 లో రిలీజయిన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు.
తెలంగాణ 2024 గద్దర్ అవార్డుల్లో లక్కీ భాస్కర్ సినిమా.. ఉత్తమ మూడవ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటర్, స్పెషల్ జ్యురి అవార్డు హీరో విభాగాల్లో మొత్తం నాలుగు అవార్డులు గెలుచుకుంది.
కల్కి 2898AD సినిమా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో మొత్తం నాలుగు అవార్డులు గెలుచుకుంది.
35 ఇది చిన్నకథ కాదు సినిమా.. ఉత్తమ నటి, ఉత్తమ బాలల చిత్రం, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగాల్లో మూడు అవార్డులు గెలుచుకుంది.
రజాకార్ సినిమా.. ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ విభాగాల్లో మూడు అవార్డులు గెలుచుకుంది.
పొట్టెల్, రాజు యాదవ్, గామి, మత్తు వదలరా, పుష్ప 2, కమిటీ కుర్రోళ్ళు సినిమాలు రెండేసి విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నాయి. ఆయ్, సరిపోదా శనివారం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఊరుపేరు భైరవకోన, మ్యూజిక్ షాప్ మూర్తి, దేవర, గ్యాంగ్ స్టర్, క.. సినిమాలు ఒక్కో విభాగంలో అవార్డులు సాధించాయి.
Also Read : Mass Jathara : రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ పండక్కి థియేటర్స్ లో సందడి..