Mass Jathara : రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ పండక్కి థియేటర్స్ లో సందడి..
తాజాగా ఈ సినిమా రిలిజ్ డేట్ ని మూవీ యూనిట్ ప్రకటించారు.

Raviteja Mass Jathara Movie Release Date Announced
Mass Jathara : రవితేజ, శ్రీలీల జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మాస్ జాతర. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్ రిలీజ్ చేసి ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్స్ సినిమా అని హింట్ ఇచ్చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
తాజాగా ఈ సినిమా రిలిజ్ డేట్ ని మూవీ యూనిట్ ప్రకటించారు. మాస్ జాతర సినిమా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. దీంతో వినాయక చవితి పండక్కి థియేటర్స్ లో మాస్ జాతరే అంటున్నారు ఫ్యాన్స్.