×
Ad

Prasanth Varma : హనుమాన్ డైరెక్టర్ పై నిర్మాత ఫిర్యాదు.. వంద కోట్లు ఇవ్వాల్సిందే.. కౌంటర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ..

గత కొన్ని రోజులుగా ప్రశాంత్ వర్మ పలువురు నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకొని సినిమాలు చేయట్లేదని వార్తలు వస్తున్నాయి. (Prasanth Varma)

Prasanth Varma

Prasanth Varma : అ, జాంబిరెడ్డి, కల్కి.. ఇలా మొదట్నుంచి డిఫరెంట్ సినిమాలతో మెప్పిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. గత సంవత్సరం వచ్చిన హనుమాన్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ప్రశాంత్ వర్మ ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. అంతే కాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించి అందులో రాబోయే సినిమాలను ఒక్కొక్కటి ప్రకటించడంతో ప్రశాంత్ వర్మపై అంచనాలు నెలకొన్నాయి.(Prasanth Varma)

అయితే సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు కానీ ఇప్పటిదాకా ఒక్కటి కూడా బయటకు రాలేదు. గత కొన్ని రోజులుగా ప్రశాంత్ వర్మ పలువురు నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకొని సినిమాలు చేయట్లేదని వార్తలు వస్తున్నాయి. తాజాగా హనుమాన్ నిర్మాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసారు.

Also Read : Venu Swamy : అమ్మ హాస్పిటల్ లో.. లక్షల్లో బిల్లు.. డబ్బుల కోసం వేణుస్వామికి ఫోన్ చేస్తే.. విష్ణుప్రియ ఎమోషనల్..

హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి తన ఫిర్యాదులో.. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ మా బ్యానర్ లో అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస.. సినిమాలు చేస్తానని చెప్పి దాదాపు 10 కోట్లకు పైగా అడ్వాన్స్‌ తీసుకున్నాడు కానీ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ప్రారంభించలేదు. ఆ సినిమాలు చేయకపోవడంతో Loss of Business Opportunities కింద ప్రశాంత్ వర్మ నుండి 100 కోట్లు ఇప్పించాలి. ఇవే కాకుండా అధీర సినిమా డైరెక్షన్ కోసం కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినా ఆ సినిమాని కూడా సీరియస్‌గా తీసుకోలేదు. అలాగే ప్రశాంత్ వర్మకు చెందిన ఆక్టోపస్ సినిమా హక్కులను వేరే నిర్మాత దగ్గర 10.23 కోట్లు పెట్టి కొనిపించాడు కానీ ఇప్పటివరకు ఆ సినిమా NOC ఇవ్వలేదు అంటూ పలు ఆరోపణలు చేసారు.

Prasanth Varma

అయితే దీనికి ప్రశాంత్ వర్మ కౌంటర్ ఇస్తూ ఫిలిం ఛాంబర్ కి సమాధానమిచ్చాడు. ప్రశాంత్ వర్మ.. నేను అయిదు సినిమాలు చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు. ఎలాంటి అగ్రిమెంట్ కూడా సంతకం చేయలేదు. ఆక్టోపస్ సినిమా విషయంలో ఏదైనా సమస్య ఉంటే అది నిర్మాతతోనే మాట్లాడుకోవాలి. నాకు వాళ్ళ నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు కేవలం 15.82 కోట్లు మాత్రమే వచ్చాయి. అవి అడ్వాన్స్ కాదు హనుమాన్ సినిమాకు గాను నాకు రావాల్సిన షేర్. అది కూడా పూర్తిగా ఇవ్వలేదు. అధీర సినిమా కోసం నాకు ఇచ్చిన కోటి రూపాయలు కూడా టీజర్ డైరెక్షన్ కోసమే ఇచ్చారు సినిమా కోసం కాదు. హనుమాన్ సినిమా 295 కోట్లు కలెక్ట్ చేస్తూ అందులో నుంచి నాకు రావాల్సిన వాటా మొత్తం ఇవ్వకుండా ఆ డబ్బును డార్లింగ్, సంబరాల ఏటిగట్టు, బిల్లా రంగా భాష సినిమాలకు వాడుకున్నారు. నాకు రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టడానికే ఇలా చెప్తున్నారు అని సమాధానమిచ్చాడు.

Also See : Allu Sirish Engagement : అల్లు శిరీష్ నిశ్చితార్థం నుంచి మరిన్ని ఫొటోలు.. సందడి చేసిన సెలబ్రిటీలు..

దీంతో ప్రశాంత్ వర్మ – నిరంజన్ రెడ్డి వివాదం టాలీవుడ్ లో చర్చగా మారింది. మరి దీనిపై ఈ ఇద్దరిలో మీడియా ముందుకు ఎవరైనా వస్తారా? అసలు వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నా ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.