Producer Rajesh Danda shocking comments at K Ramp pre-release event
Rajesh Danda: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కె ర్యాంప్. రొమాంటింక్ యూత్ ఫుల్ అండ్ కామెడీ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కిస్తున్నాడు. యుక్తి తెరేజా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను నిర్మాత రాజేష్ దండ(Rajesh Danda) ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 18న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గురువారం నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో నిర్మాత రాజేష్ దండ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లో వైల్డ్ టాస్క్.. రమ్య తలకు గాయం.. ఇక ఆ ముగ్గురిలోనే ఒకరు
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..”ఆ మధ్య నేను నా సినిమా ప్రమోషన్స్ లో తొడ కొట్టాను. మరొకరు ఎమోషనల్ అయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఎదో ఒకటి చేసి ఆడియన్స్ అటెన్షన్ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, మనం ఎన్ని వేషాలు వేసినా అవేవి పని చేయవు. నా సినిమా అయినా.. వేరొక సినిమా అయినా కంటెంట్ లేకపోతే ఏమీ చేయలేం. ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. వారు ఎవరు ఎలాంటి మాటలు వినరు. ఈవారం పోటీలో ఉన్న మిత్ర మండలి, తెలుసు కదా, డ్యూడ్ సినిమాలకు నా శుభాకాంక్షలు” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్ప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.
ఇక కె ర్యాంప్ విషయానికి వస్తే, సినిమా విషయంలో మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. నిర్మాత గతంలో ఎన్నడూ లేనంత విదంగా సినిమాను ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఇక కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. ఎక్కడ చూసిన ఆయనలో ఒక మంచి సినిమా చేశాం అనే ధైర్యం కనిపిస్తోంది. కాబట్టి, కె ర్యాంప్ సినిమాకి ఆడియన్స్ నుంచి కొంచం పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చినా సూపర్ హిట్ అయ్యే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. మరి ఈ సినిమాకు అక్టోబర్ 18న ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారు అనేది చూడాలి.