Producer Singanamala Ramesh Sensational Comments on Pawan Kalyan Bandla Ganesh Counter
Bandla Ganesh : ఒకప్పుడు నిర్మాతగా పలు సినిమాలు, ఫైనాన్షియర్ గా పని చేసిన నిర్మాత సింగనమల రమేష్ వరుస ఫ్లాప్స్ రావడం, ఓ కేసులో జైలుకి వెళ్లడం, ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం.. ఇలా పలు కారణాలతో సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ఆల్మోస్ట్ మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాను అంటూ ఓ ప్రెస్ మెట్ పెట్టారు సింగనమల రమేష్. ఈ ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
Also Read : Priyanka Chopra : మహేష్ – రాజమౌళి సినిమా మొదలుపెట్టాక.. ప్రియాంక చోప్రా ఫస్ట్ ఫోటోషూట్..
అయితే సింగనమల రమేష్ చివరగా తీసిన మహేష్ బాబు ఖలేజా, పవన్ కళ్యాణ్ కొమరం పులి సినిమాలు పరాజయం పాలయి భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. వాటి గురించి ప్రశ్న ఎదురవ్వగా సింగనమల రమేష్ మాట్లాడుతూ.. రాజమౌళి, శంకర్.. లాంటి వాళ్ళ సినిమాలు అయితేనే మూడేళ్లు అలా పైన పడుతుంది. ఆ రోజుల్లో ఆరు నుంచి తొమ్మిది నెలల్లో సినిమాలు అయిపోతాయి. కానీ కొమురం పులి సినిమా మూడేళ్లు పట్టింది. మూడేళ్లు ఆఫీస్, శాలరీలు, వడ్డీలు.. ఇలా చాలా ఖర్చులు పెరిగాయి. నాకు కొమరం పులి, ఖలేజా రెండు సినిమాల్లో 100 కోట్ల నష్టం వచ్చింది. ఇద్దరు హీరోలు కనీసం అయ్యో పాపం అని కూడా అనలేదు. కొమరం పులి సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యంతో బిజీగా ఉన్నారు అందుకే ఆ సినిమా లేట్ అయింది. ఖలేజాకు కూడా లేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి అని తెలిపారు.
Also Read : NTR : నాటు నాటు స్టెప్పుతో ఫిఫా వరల్డ్ కప్ పోస్టర్.. ఎన్టీఆర్ పేరుతో.. అదిరింది బాసూ..
దీంతో సింగనమల రమేష్ వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలకు నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. బండ్ల గణేష్ తన ట్వీట్ లో.. సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు. మీ కోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ సినిమా చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షి నేను. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి. ఇది కరెక్ట్ కాదు అని అన్నారు. మరి సింగనమల రమేష్ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలో ఇంకెవరైనా స్పందిస్తారేమో చూడాలి.
సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు మీ కోసం @PawanKalyan గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు ప్రత్యక్ష సాక్షి నేను దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు . https://t.co/LVGihOWIhI
— BANDLA GANESH. (@ganeshbandla) February 5, 2025