NTR : నాటు నాటు స్టెప్పుతో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ పోస్ట‌ర్‌.. ఎన్టీఆర్ పేరుతో.. అదిరింది బాసూ..

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్.. ఎన్టీఆర్ పేరుతో ఓ పోస్ట్ చేసింది.

NTR : నాటు నాటు స్టెప్పుతో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ పోస్ట‌ర్‌.. ఎన్టీఆర్ పేరుతో.. అదిరింది బాసూ..

Fifa world cup shares ntr poster tarak fans full happy

Updated On : February 5, 2025 / 1:03 PM IST

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయ్యారు. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్టీఆర్‌కు అభిమానులు వ‌చ్చారు. హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కులు సైతం ఎన్టీఆర్‌తో సినిమా చేయాల‌ని ఉందంటూ ప‌లు వేదిక‌ల‌పై మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఆస్కార్స్ అకాడమీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవుతున్న ఇద్దరు భారత పురుష నటీనటుల్లో ఎన్టీఆర్ ఒక‌రు. మ‌రొక‌రు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌.

తాజాగా ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్.. ఎన్టీఆర్ పేరుతో ఓ పోస్ట్ చేసింది. దిగ్గ‌జ ఆట‌గాళ్లు నెయ్‌మార్‌ (N), క‌ర్లిటోస్ తెవెజ్‌(T), క్రిస్టియానో రొనాల్డో(R) ముగ్గురి పుట్టిన రోజు ఈ రోజు (ఫిబ్ర‌వ‌రి 5న‌). ఈ క్ర‌మంలో ఈ ముగ్గురికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను షేర్ చేసింది.

IND vs ENG : భార‌త్‌, ఇంగ్లాండ్ వ‌న్డే సిరీస్‌.. షెడ్యూల్‌, హెడ్ టు హెడ్ రికార్డ్స్‌, లైవ్ స్ట్రీమింగ్ వివ‌రాలు.. ఇవే..

ఈ ముగ్గురు ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు డ్యాన్స్ స్టెప్పు వేస్తున్నట్లుగా పోస్ట‌ర్‌ను డిజైన్ చేసి షేర్ చేసింది. అంతేకాదండోయ్ NTR అంటూ టైటిల్ ఇచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by FIFA World Cup (@fifaworldcup)

Pat Cummins – kohli : ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు.. కోహ్లీని స్లెడ్జింగ్ చేసిన క‌మిన్స్‌..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ క‌లిగిన ఫుట్‌బాల్ లో మేజ‌ర్ టోర్నీ అయిన ఫిఫా వ‌రల్డ్ క‌ప్ అకౌంట్ ఇలా NTR పేరుతో పోస్ట్ రావ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ స్పందించింది. మూడు ల‌వ్ సింబ‌ల్స్‌ను పోస్ట్ చేసింది.