Pat Cummins – kohli : ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు.. కోహ్లీని స్లెడ్జింగ్ చేసిన కమిన్స్..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్లెడ్జింగ్ చేశాడు.

Pat Cummins trolls several cricketers including Virat kohli in Champions Trophy ad
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. 8 దేశాలు ఈ మెగా టోర్నీ బరిలో ఉన్నాయి. ఇప్పటికే అన్ని దేశాలు ఈ టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించాయి. అయితే.. ఆయా జట్లు తమ స్క్వాడ్స్‌ను మార్చుకునేందుకు ఫిబ్రవరి 11 వరకు అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచేందుకు అన్ని జట్లు తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేశాడు. అంతేకాదండోయ్ స్టార్ ఆటగాళ్లు బెన్‌స్టోక్స్, పోప్ వంటి ఆటగాళ్లను సైతం కమిన్స్ వదిలి పెట్టలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో కమిన్స్ షేవ్ చేసుకుంటూ కనిపించాడు. ఈ క్రమంలో అతడు పలువురు ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేశాడు. కోహ్లీ స్ట్రైక్‌రేటును ప్రస్తావించాడు. నువ్వు ఇంత నిదానంగా బ్యాటింగ్ చేయడాన్ని ఎన్నడూ చూడలేదని అంటూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా పోప్.. నువ్వు ఇక ప్రార్థన మొదలు పెట్టడం మంచిదని అన్నాడు. అలాగే బెన్‌స్టోక్స్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ క్వింటన్ డికాక్‌లను కూడా వదిలిపెట్టలేదు.
Pat Cummins can play villan so easily in any of the bond movies.
Look at his eyes 🤪
There is whole Villian arc which is left to explore post his retirement from cricket …pic.twitter.com/yL5iFPgh6N— Raazi (@Crick_logist) February 4, 2025
2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో కమిన్స్ vs కోహ్లీ..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో కోహ్లీని కమిన్స్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 63 బంతులు ఎదుర్కొని 85.71 స్ట్రైక్‌రేటుతో 54 పరుగలు మాత్రమే చేశాడు. ఇందులో 4 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కమిన్స్ 10 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం అనుమానమే..!
పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాట్ కమిన్స్ ఆడడం సందేహంగానే ఉంది. చీలమండల గాయంతో కమిన్స్ బాధపడుతున్నాడు. ఆ గాయం నుంచి అతడు ఇంకా పూర్తిగా కోలుకోనట్లుగా తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేర్చులకు మరో వారం మాత్రమే అవకాశం ఉంది.
కమిన్స్ ఇంకా ప్రాక్టీస్‌ను మొదలుపెట్టలేదని, అయితే.. అతడి అనుభవం తమకు చాలా ముఖ్యం అని ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ చెప్పారు. మరో రెండు రోజుల్లో వైద్యులు ఇచ్చే నివేదికపైనే కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా? లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఒకవేళ అతడు ఈ టోర్నీలో ఆడలేకపోతే స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్‌లలో ఒకరు ఆస్ట్రేలియాకు నాయకత్వం వహిస్తారని వెల్లడించారు.