Mohammed Shami : ఇంగ్లాండ్‌తో తొలి వన్డే.. వరల్డ్ రికార్డుపై షమీ కన్ను.. రీ ఎంట్రీ ఫస్ట్ మ్యాచ్‌లోనే..
ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో షమీ ప్రపంచ రికార్డును అందుకునే అవకాశం ఉంది.

Mohammed Shami eye on world record needs 5 wickets in 1st ODI against England
వన్డేల్లో మహ్మద్ షమీ చివరి సారిగా వన్డేల్లో స్వదేశంలో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. చీలమండల గాయంతోనే ఆ టోర్నీ ఆడిన షమీ.. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్నాడు. 14 నెలల విరామం తరువాత మైదానంలో అడుగుపెట్టాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో మూడో టీ20 మ్యాచ్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు.
అయితే.. నాలుగో టీ20 మ్యాచ్‌లో అతడికి చోటు దక్కలేదు. ఇక ఐదో టీ20లో తన సత్తా చాపాడు. 2.3 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. రీ ఎంట్రీలో అతడు తన లయను ఇంకా అందుకోలేదు. ఇందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ అతడికి సన్నాహకంగా ఉపయోగపడనుంది. కాగా.. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తరువాత షమీ వన్డేల్లో ఇంగ్లాండ్‌తో తొలి వన్డేతోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఈ మ్యాచ్‌లో అతడు గనుక 5 వికెట్లు తీస్తే ప్రపంచ రికార్డు సాధిస్తాడు. షమీ ఇప్పటి వరకు.. 101 వన్డేలు ఆడాడు. 195 వికెట్లు తీశాడు. అత్యుత్తమ ప్రదర్శన 7/57. మరో ఐదు వికెట్లు తీస్తే 200 వికెట్ల క్లబ్‌లో చేరుతాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలోనే ఐదు వికెట్లు తీస్తే మాత్రం.. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. స్టార్క్ 102 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని సాధించాడు. ఆ తరువాత సక్లైన్ ముస్తాక్ , ట్రెంట్ బౌల్డ్ వరుసగా ఉన్నారు.
వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు..
మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా) – 102 మ్యాచ్‌లు
సక్లైన్ ముస్తాక్ (పాకిస్థాన్) – 104 మ్యాచ్‌లు
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) – 107 మ్యాచ్‌లు
బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) – 112 మ్యాచ్‌లు
అలన్ డొనాల్డ్ (దక్షిణాఫ్రికా) – 117 మ్యాచ్‌లు
Rahul Dravid : బెంగళూరులోని రద్దీ రోడ్డు పై ఆటో డ్రైవర్‌తో ద్రవిడ్ గొడవ.. వీడియో వైరల్
భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి వన్డే.. ఫిబ్రవరి 6న – నాగ్‌పూర్
రెండో వన్డే.. ఫిబ్రవరి 9న – కటక్
మూడో వన్డే.. అహ్మదాబాద్ – అహ్మదాబాద్
భారత కాలమానం ప్రకారం వన్డేల మ్యాచ్‌లు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.