Rahul Dravid : బెంగళూరులోని రద్దీ రోడ్డు పై ఆటో డ్రైవర్‌తో ద్రవిడ్ గొడవ.. వీడియో వైరల్
రాహుల్ ద్రవిడ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rahul Dravid Car Collision With Auto In Bengaluru Heated Argument Follows
టీమ్ ఇండియా మాజీ హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరు నగరంలోని ఓ రద్దీ రోడ్డు పై ఓ ఆటో డ్రైవర్‌తో అతడు గొడవ పడుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. పలు ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం బెంగళూరులోని రద్దీగా ఉండే కన్నింగ్ హామ్ రోడ్డు లో ద్రవిడ్ కారును ఓ గూడ్స్ ఆటో ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్‌తో ద్రవిడ్ గొడపడినట్లుగా సదరు కథనాలు పేర్కొన్నాయి.
ఘటన జరిగిన సమయంలో ద్రవిడ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జంక్షన్ నుండి హై గ్రౌండ్స్ వైపు ప్రయాణిస్తున్నట్లుగా చెప్పాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్న సమయంలో ద్రవిడ్ కారును ఆటో డ్రైవర్ వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ సమయంలో ద్రవిడ్ కారు ముందున్న వాహనాన్ని తాకిందని చెబుతున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సంఘటన స్థలం నుండి బయలుదేరే ముందు ద్రవిడ్ ఆటో డ్రైవర్ ఫోన్ నంబర్‌ను తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. ఘటన జరిగిన సమయంలో ద్రవిడ్ కారును స్వయంగా నడుతున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
Indian cricketer Rahul Dravid’s car & a commercial goods vehicle were involved in a minor accident on Cunningham road in #Bengaluru. And unlike the #cred ad, #RahulDravid & the goods vehicle driver engaged in a civilized argument & left the place later. No complaint so far pic.twitter.com/HJHQx5er3P
— Harish Upadhya (@harishupadhya) February 4, 2025
రోడ్డు పై వెలుతున్న వారి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆటో డ్రైవర్ తప్పా లేక ద్రవిడ్ తప్పా అనేది స్పష్టంగా లేదు. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు.
ఇక ద్రవిడ్ విషయానికి వస్తే.. టీమ్ ఇండియా తరుపున 164 టెస్టులు, 344 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 52.3 సగటుతో 13288 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు 63 అర్థశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 39.2 సగటుతో 10889 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు 83 అర్థశతకాలు ఉన్నాయి. ఒకే ఒక టీ20 మ్యాచ్‌లో 31 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 89 మ్యాచ్‌లో 28.2 సగటుతో 1882 పరుగులు చేశాడు.
అతడు టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ 2024 ను అందించాడు.