IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్.. షెడ్యూల్, హెడ్ టు హెడ్ రికార్డ్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు.. ఇవే..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. హెడ్ టు హెడ్ రికార్డులు, స్ట్రీమింగ్ ఇంకా..

IND vs ENG odi series head to head records live streaming details here
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది టీమ్ఇండియా. ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. గురువారం నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డేకు నాగ్‌పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్, ఇంగ్లాండ్ జట్లు ఆడనున్న చివరి వన్డే సిరీస్ ఇదే. ఈ క్రమంలో ఇరు జట్లు ఈ సిరీస్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాయి. కాంబినేషన్‌తో పాటు వ్యూహాలను రచించేందుకు అనువుగా భావిస్తున్నాయి.
ఇటు భారత్, అటు ఇంగ్లాండ్ రెండు జట్లు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లనే వన్డే సిరీస్‌కు ఎంపిక చేశాయి. టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జోరూట్ వంటి సీనియర్ ఆటగాళ్ల చేరికలతో ఆయా జట్లు బలంగా మారాయి. వన్డేల్లో సీనియర్ ఆటగాళ్ల అనుభవం ఎంతో కీలకం కానుంది.
భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్:
తొలి వన్డే.. ఫిబ్రవరి 6న – నాగ్‌పూర్
రెండో వన్డే.. ఫిబ్రవరి 9న – కటక్
మూడో వన్డే.. ఫిబ్రవరి 12న – అహ్మదాబాద్
ఈ మూడు వన్డేలు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే..
భారత్, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటి వరకు 107 వన్డే మ్యాచ్‌లో తలపడ్డాయి. ఇందులో 58 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా ఇంగ్లాండ్ 44 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. రెండు మ్యాచ్‌లు టైగా ముగియగా మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక భారతదేశంలో ఇంగ్లాండ్, భారత్‌లు 52 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 34 మ్యాచ్‌ల్లో గెలిచింది. 17 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
వన్డే సిరీస్‌కు ఆయా క్రికెట్ బోర్డులు ప్రకటించిన జట్లు ఇదే..
భారత్..
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా
ఇంగ్లాండ్..
హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్(ఇంగ్లాండ్), జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, మార్క్ వుడ్.
ఎక్కడ చూడాలంటే..?
భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. దీంతో స్టోర్ట్స్ 18 ఛానెల్‌లో మ్యాచ్‌లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఇక డిజిటల్ ఫ్లాట్ ఫామ్ విషయానికి వస్తే.. డిస్నీ హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.