Ram Charan Sirish
Sirish : ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాత శిరీష్ మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయ్యాక రామ్ చరణ్ అసలు ఫోన్ చేయలేదు అంటూ పలు కామెంట్స్ చేయడంతో అవి వైరల్ అవ్వగా చరణ్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. పలువురు చరణ్ ఫ్యాన్స్ శిరీష్ ని హెచ్చరిస్తూ ఓ లెటర్ రిలీజ్ చేయడంతో ఈ ఇష్యూ పెద్దగా మారింది. ఆల్రెడీ సిరీస్ క్షమాపణలు చెప్తూ నిన్నే ఒక లెటర్ కూడా రిలీజ్ చేసారు. అయినా పలువురు చరణ్ ఫ్యాన్స్ శిరీష్ ని ట్రోల్ చేయడం, వాళ్ల సంస్థ నుంచి రాబోతున్న తమ్ముడు సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా శిరీష్ మరోసారి క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
Also Read : Akhanda 2 : ‘అఖండ’ పాప పెద్దయ్యాక పార్ట్ 2 లో ఇలా.. బాలయ్య వచ్చేది ఈమె కోసమే.. ఈమె ఎవరో తెలుసా?
ఈ వీడియోలో శిరీష్ మాట్లాడుతూ.. మా సంస్థకు, చిరంజీవికి, రామ్ చరణ్ కి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. నేను అభిమానించే హీరోల్లో చరణ్ గారు ఒకరు. ఆయన్ని అవమానపరచడం కానీ, కించపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడూ చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన గురించి చిన్న మాట దొర్లినా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి నిజంగా క్షమాపణలు చెప్తున్నా. చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నా. ఆయనతో నాకు ఉన్న రిలేషన్ ని పాడు చేసుకోదలుచుకోలేదు. బయట జనాలు మాట్లాడుతున్న మాటలు, ట్రోలింగ్స్, అభిమానుల బాధ నేను అర్ధం చేసుకోగలను. ఎందుకంటే ఒక హీరోని ఎవరైనా అంటే వాళ్ళ ఫ్యాన్స్ భరించలేరు.
నా ఇంటెన్షన్ అది కాదు. మాకు ఉన్న రిలేషన్, మాకున్న క్లోజ్ నెస్ తో నేను మాట దొర్లాను తప్ప ఆయనని అవమానపరచడానికి కాదు. మాకు మెగా హీరోలందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. అందరితో సినిమాలు చేసాము. ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళని నేను అవమానించేంత మూర్ఖుడిని కాదు. దయచేసి అభిమానులు అర్ధం చేసుకోవాలి. సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రిలీజ్ చేసాం. ఆయన ఒప్పుకోకపోయి ఉంటే రిలీజ్ అయ్యేది కాదు. చరణ్ గారే మా గురించి ఆలోచించి, మా ఫైనాన్షియల్స్ ఆలోచించి రిలీజ్ చేసుకోమన్నారు. అలాంటి ఆయన్ని ఎందుకు అవమానపరుస్తాను. ఒకవేళ నా మాటలు ఎవరినైనా బాధపెడితే ఫ్యాన్స్ అందరికి క్షమాపణలు చెబుతున్నాను. దయచేసి మా రిలేషన్ ని పాడు చేయొద్దు. మళ్ళీ రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నాం. ఇలాంటి సమయంలో మా ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తీసుకురావొద్దు అని అందర్నీ కోరుకుంటున్నాను. అని అన్నారు.
Official statement from our Producer Shirish Garu. pic.twitter.com/I4mv9r18w7
— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2025
Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?