Raja Saab : ప్రభాస్ బర్త్ డేకి రాజాసాబ్ టీజర్..? అప్పట్నుంచి వరుస అప్డేట్స్..

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్‌’

Producer SKN intresting comments on Prabhas Raja Saab movie

Raja Saab : మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్‌’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. హారర్, రొమాంటిక్, కామెడీ క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. 2025 ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్ర అప్‌డేట్స్ కోసం సినీ ప్రియులు అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. నిర్మాత శ్రీనివాస కుమార్ (ఎస్‌కేఎన్‌) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంద‌న్నారు. అక్టోబ‌ర్ 23 (ప్ర‌భాస్ పుట్టిన రోజు) నుంచి ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ ప్రారంభం అవుతాయ‌న్నారు. ఆ త‌రువాత నుంచి వ‌రుస‌గా అప్‌డేట్స్ వ‌స్తాయ‌న్నారు. ఇందుకోసం దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వ ప్రసాద్ ప్ర‌ణాళిక‌ల‌ను వేసుకున్న‌ట్లుగా చెప్పారు.

Matka first single : ‘మట్కా’ నుంచి ఫస్ట్ సింగిల్.. ‘లే లే రాజా’లో అదిరిపోయిన నోరా ఫ‌తేహి స్టెప్పులు..

అక్టోబర్‌ 23 నుంచి రిలీజ్ వరకు రాజాసాబ్‌ ప్రపంచంలోకి ప్రేక్ష‌కుల‌ను తీసుకువెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు. ఇక‌ దర్శకుడు మారుతి ఒక్క రోజు కూడా స‌మ‌యం వృథా చేయ‌కుండా షూటింగ్ పూర్తి చేసే ప‌నిలో ఉన్నార‌న్నాడు. వినాయకచవితి, దసరా ఇలా ఏ పండగకు కూడా ఆయన సెలవు తీసుకోలేద‌ని, కష్టపడుతున్నార‌న్నారు. అనుకున్న సమయంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పట్టుదలతో మారుతి ఉన్న‌ట్లు చెప్పారు.

సలార్, కల్కి 2898 ఏడీ వంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్​ సినిమాల తర్వాత ప్రభాస్ న‌టిస్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్‌ సరికొత్త అవతారంలో కనిపించనున్నారని అంటున్నారు.

Game Changer : దీపావ‌ళికి గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్‌! త‌మ‌న్ ట్వీట్ వైర‌ల్‌..