Matka first single : ‘మట్కా’ నుంచి ఫస్ట్ సింగిల్.. ‘లే లే రాజా’లో అదిరిపోయిన నోరా ఫతేహి స్టెప్పులు..
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం మట్కా.

First single from Varun Tej Matka movie
Matka first single : మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం మట్కా. కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి కథానాయిక. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో నవీన్ చంద్ర, నోరా ఫతేహి, సలోనిలు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
Game Changer : దీపావళికి గేమ్ ఛేంజర్ టీజర్! తమన్ ట్వీట్ వైరల్..
ఇక ఈ సినిమాలోని పాటలను విడుదల చేస్తున్నారు. జివి.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని మొదటి పాట ‘లే లే రాజా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటలో నోరా ఫతేహి తనదైన స్టెప్పులతో కుర్రకారును ఆకట్టుకుంది.