మన స్వదేశి అబ్బాయిలు విదేశీ అమ్మాయిలను వలచి వరించటం కొత్తేమీ కాకపోయినా ప్రస్తుత కరోనా క్రైసిస్‌లో ఇలాంటి ఖండాంతర వివాహం జరగటాన్ని ప్రత్యేక విశేషంగా చెప్పుకోవాలి. అలాంటి ఒక ఖండాంతర, మతాంతర, కులాంతర వివాహం భారత కాలమానం ప్రకారం ఈ రోజు(జూలై 17) సాయంత్రం 8 గంటల 15 నిముషాలకు అమెరికాలోని సౌత్ కరోలినాలో జరగనుంది.
సూపర్ స్టార్ కృష్ణ- శ్రీమతి విజయనిర్మల కాంబినేషన్లో పి.సి. రెడ్డి దర్శత్వంలో ‘‘అన్నయ్య’’ అనే 500 ఏపిసోడ్స్ మెగా టీవీ సీరియల్‌తో పాటు టాలీవుడ్లో పలు తెలుగు చిత్రాలు నిర్మించి, వందలాది చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ప్రొడ్యూసర్ కమ్ ఫైనాన్సియర్ సోమా విజయ ప్రకాష్- సోమా జ్యోతి దంపతుల తనయుడు సోమా వినీత్ వివాహం అమెరికా వాస్తవ్యులు మిస్టర్& మిస్సెస్ అలన్ ఏ.రస్సెల్ కుమార్తె కైత్లిన్ తో ఈ రోజు జరగనుంది.