Srujan Yarabolu
Srujan Yarabolu : ఇప్పుడున్న ఓటీటీ జనరేషన్ లో థియేటర్స్ లో సినిమాలే సరిగ్గా వర్క్ అవట్లేదు. ఇక రీమేక్ లు అయితే అసలు వాటి ఊసే లేదు. ప్రపంచంలో ఎక్కడ ఏ సినిమా రిలీజయినా ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. కొన్నివేరే భాష సినిమాలు మన తెలుగులో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇక్కడి ప్రేక్షకులు ఆ సినిమాలు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓ నిర్మాత రీమేక్ సినిమా చేయడమే కాక దాన్ని రీమేక్ సినిమా అన్నందుకు కౌంటర్ ఇచ్చాడు.(Srujan Yarabolu)
తరుణ్ భాస్కర్, ఈషారెబ్బ జంటగా సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓం శాంతి శాంతి శాంతిః. ఈ సినిమా మలయాళం జయ జయ జయ జయహే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. సృజన్ యరబోలు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 30 న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్లో నిర్మాత సృజన ఈ సినిమాని అందరూ రీమేక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారని మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
Also See : Happy Movie Working Stills : 20 ఏళ్ళ అల్లు అర్జున్ ‘హ్యాపీ’.. అప్పటి వర్కింగ్ స్టిల్స్ చూశారా..?
సృజన మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను, డైరెక్టర్ ట్రైలర్ ఎలా ఉంటుందో రెస్పాన్స్ చెప్తారని చూస్తున్నాం. ట్రైలర్ కింద కామెంట్స్ లో ఎవరైనా సినిమా, డైలాగ్స్, యాక్టింగ్, సాంకేతిక అంశాల గురించి మాట్లాడతారేమో అనుకున్నా. కానీ అందరూ రీమేక్, రీమేక్.. రీమేక్.. అని కామెంట్స్ చేస్తున్నారు. రీమేక్ అనే పదాన్ని వాళ్ళే కనిపిట్టినట్టు సైంటిస్టుల లాగా వాళ్ళేదో ఇది కనుక్కున్నట్టు చెప్తున్నారు.
మేమే రీమేక్ అని చెప్తున్నాం కదా. అసలు రీమేక్ అంటే ఏంటి మనకు తెలిసిన కథని ఇంకోలా చెప్పడం. రామాయణం ఎన్ని రకాలుగా చెప్పినా మళ్ళీ మళ్ళీ వింటాం, చూస్తాం. ఈ సినిమా ఇంటింటి రామాయణం లాంటిదే. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడొచ్చు అని నమ్మి చేసిన సినిమా. మీరు మమ్మల్ని నమ్మి సినిమాకు రండి అని అన్నారు.
Also Read : Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ మొదలు.. త్వరలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ..
దీంతో సృజన పై విమర్శలు వస్తున్నాయి. అసలు రీమేక్స్ అవసరం లేని జనరేషన్ లో రీమేక్ సినిమా తీయడమే కాకుండా దాన్ని రీమేక్ అని చెప్పినందుకు ప్రేక్షకులపైనే కామెంట్స్ చేస్తున్నారా, పైగా దాన్ని రామాయణంతో పోలుస్తున్నారా అని విమర్శలు వస్తున్నాయి.