×
Ad

Paradise : ప్యారడైజ్ ఇంకా షూటింగ్ అవ్వలేదు.. చరణ్ తో పోటీకి రాదు.. నాని సినిమాపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి మీడియాతో మాట్లాడుతూ నాని ప్యారడైజ్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. (Paradise)

Paradise

  • నిర్మాత సుధాకర్ చెరుకూరి ఇంటర్వ్యూ
  • నాని ప్యారడైజ్ సినిమాపై అప్డేట్
  • రిలీజ్ వాయిదా

Paradise : న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమా మార్చ్ 26 రిలీజ్ చేస్తారని ప్రకటించారు. అయితే అదే సమయంలో రామ్ చరణ్ పెద్ది సినిమా కూడా రిలీజ్ కి ఉంది. మరి ఈ రెండు సినిమాలు పోటీ పడతాయా అనే చర్చ ఇన్ని రోజులు జరుగుతూ ఉంది.(Paradise)

తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి మీడియాతో మాట్లాడుతూ నాని ప్యారడైజ్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు.

Also Read : Chiranjeevi : మెగాస్టార్ – శ్రీకాంత్ ఓదెల సినిమాపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ అంటూ..

సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. రామ్ చరణ్, నాని రెండు సినిమాలు ఒకేసారి రావు. సమ్మర్లో పెద్ద సినిమాలు ఎక్కువ లేవు. కాబట్టి వాయిదా పడొచ్చు. మేము పోటీకి రాము. సమ్మర్ లో ఎప్పుడు వచ్చినా పర్లేదు. సినిమా అంతా సెట్స్ లోనే ఎక్కువ షూటింగ్ జరుగుతుంది. లైవ్ లొకేషన్స్ లేవు. ఎన్టీఆర్ సీఎం అయినప్పటి కాలంలో ముగిసే కథ ఇది. 1980 సమయంలో కథ. 60 శాతం షూటింగ్ అయింది. పాటలు, ఇంకొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. మార్చ్ వరకు పూర్తి చేయడానికి ట్రై చేస్తాము. అవ్వకపోయినా కంగారు లేదు. డైరెక్టర్ కి రిలీజ్ డేట్ ప్రెజర్ లేకుండానే తీయమని చెప్పాను. ప్రస్తుతం రాత్రి పూట వర్షం సీక్వెన్ సీన్స్ షూటింగ్ జరుగుతుంది.

నాకు ఇండస్ట్రీ హిట్ కావాలి, అలాంటి సినిమా తీయాలని ఉంది. అది ప్యారడైజ్ తో నెరవేరుతుంది. టీజర్ చూసి భూతుల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ సినిమా చూస్తే అంత వైలెంట్ అనిపించదు. ఆ భూతులు మదర్ ఎమోషన్ కి బాగానే కనెక్ట్ అవుతుంది అని తెలిపారు. దీంతో ప్యారడైజ్ సినిమా చెప్పిన డేట్ కి రాదని నిర్మాతలే క్లారిటీ ఇచ్చేసారు.

Also Read : Anaganaga Oka Raju Collection: నవీన్ పోలిశెట్టి నయా రికార్డ్.. రూ.100 కోట్ల క్లబ్ లో అనగనగా ఒక రాజు