Chiranjeevi : మెగాస్టార్ – శ్రీకాంత్ ఓదెల సినిమాపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ అంటూ..

చిరంజీవికి లైనప్ లో బాబీ సినిమా, శ్రీకాంత్ ఓదెల సినిమాలు ఉన్నాయి. (Chiranjeevi)

Chiranjeevi : మెగాస్టార్ – శ్రీకాంత్ ఓదెల సినిమాపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ అంటూ..

Chiranjeevi

Updated On : January 19, 2026 / 2:20 PM IST
  • సుధాకర్ చెరుకూరి మీడియా మీట్
  • చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల సినిమాపై కామెంట్స్
  • చిరంజీవి సినిమాపై అప్డేట్

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. ఇప్పటికే ఈ సినిమా 292 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఇక నెక్స్ట్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుందని సమాచారం.(Chiranjeevi)

ఆ తర్వాత చిరంజీవికి లైనప్ లో బాబీ సినిమా, శ్రీకాంత్ ఓదెల సినిమాలు ఉన్నాయి. నానితో దసరా సినిమా తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్ సినిమా ప్రకటించడంతో అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి, నాని కలిసి నిర్మిస్తున్నారు.

Also Read : Anaganaga Oka Raju Collection: నవీన్ పోలిశెట్టి నయా రికార్డ్.. రూ.100 కోట్ల క్లబ్ లో అనగనగా ఒక రాజు

నేడు నిర్మాత సుధాకర్ చెరుకూరి మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి సినిమా గురించి స్పందించారు. నాని ప్యారడైజ్ సినిమా అవ్వగానే రెండు నెలల్లో చిరంజీవి సినిమా మొదలుపెడతాము. ఆల్రెడీ కొంత వర్క్ జరుగుతుంది ఆ సినిమాకు సంబంధించి. చిరంజీవి గారిది పీరియాడిక్ సినిమా. 1974 – 75 మధ్యలో జరిగే కథ. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకొని తీయబోయే మాస్ కథ అని తెలిపారు సుధాకర్ చెరుకూరి.

దీంతో చిరంజీవి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కథ చేస్తున్నాడని తెలియడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నాని తో చేస్తున్న ప్యారడైజ్ రిలీజయిన రెండు నెలల్లో ఈ సినిమా వర్క్ మొదలవుతుందని తెలుస్తుంది.

Also Read : మీకు బుద్ధి ఉంటే ఒక్కసారి ఆలోచించండి: రేణూ దేశాయ్‌ ఆగ్రహం