Producer Suresh Babu responds to Akhanda 2 postponement
Suresh Babu: నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2 సినిమా నేడు(డిసెంబర్ 5) విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈరోస్ సంస్థ అఖండ 2 సినిమాను అడ్డుకుంటూ కోర్టు నుంచి స్టే వేధించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి తమకు రావలసిన అమౌంట్ క్లియర్ చేసే వరకు అఖండ 2 సినిమాను విడుదల చేయరాదు అంటూ స్టేలో పేర్కొంది. దీంతో ఈ సినిమా విడుదల తాత్కాలికంగా ఆగిపోయింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో అనేకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
దీనిపై నిర్మాత సురేష్ బాబు(Suresh Babu) స్పందించారు. తాజాగా ఆయన సైకో సిద్దార్థ అనే మూవీ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన అఖండ 2 సినిమా గురించి మాట్లాడుతూ..”అఖండ 2 మూవీ ఇష్యూ క్లియర్ చేయడానికి నేను కూడా వెళ్లాను. త్వరలోనే ఈ సమస్య క్లియర్ అవుతుంది. ఇవన్నీ కేవలం ఆర్థిక ఇబ్బందులు. వాటిని బయటకు చెప్పకూడదు. కానీ, ఈ విషయం గురించి ఎవరికివారు ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అభిమానులు ఇప్పుడు సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో కూడా ఇలా చాలా సినిమాలకు జరిగింది. కాబట్టి, త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అఖండ 2 సినిమా రిలీజ్ గురించి మేకర్స్ నుంచి త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.