Kalki Part 2 : కల్కి 2 పై అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు.. కల్కి పార్ట్ 1 విదేశాల్లో రిలీజ్ చేస్తాం..

తాజాగా కల్కి నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరయ్యారు.

Producer Swapna Dutt Gives Update on Prabhas Kalki Part 2 in Goa Film Festival

Kalki Part 2 : ప్రభాస్ కల్కి 2898AD సినిమా జూన్ లో విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా 1100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా కల్కి 2 కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, కొంత భాగం షూటింగ్ కూడా అయిందని గతంలో నిర్మాత అశ్వినీదత్ తెలిపారు.

తాజాగా కల్కి నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరయ్యారు. అక్కడి మీడియాతో మాట్లాడుతూ కల్కి గురించి మాట్లాడారు.

Also Read : Nagababu : మహారాష్ట్రలో బీజేపీ విజయం.. ప్రతి హీరో నాయకుడు కాలేడు.. గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ అంటూ నాగబాబు ట్వీట్..

నిర్మాతలు స్వప్న దత్ మాట్లాడుతూ.. కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ 35 శాతం షూటింగ్ అయిపోయింది. దీపికా పదుకోన్ తో పాటు అన్ని పాత్రలు పార్ట్ 2లో ఉంటాయి. కల్కి పార్ట్ 1 ని విదేశాల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నాము అని తెలిపారు. అయితే ప్రభాస్ చేతిలో ఉన్న రాజాసాబ్, హను రాఘవపూడి సినిమా, స్పిరిట్ సినిమాలు అయ్యాకే కల్కి 2 కి డేట్స్ ఇస్తాడని సమాచారం.