Guntur Kaaram : ‘గుంటూరు కారం’ లేటెస్ట్ అప్‌డేట్‌.. వర్చువల్ స్టూడియోలో షూటింగ్

2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న 'గుంటూరు కారం' సినిమా నుండి మరో అప్ డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే?

Guntur Kaaram

Guntur Kaaram : మహేష్-త్రివిక్రమ్ కాంబినేషనలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’ 2024 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు మేకర్స్ అప్‌డేట్‌ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్‌ వస్తుందా? అని అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘ధమ్ మసాలా’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు వండ‌ర్‌ఫుల్‌ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది.

Also Read: యానిమల్ సినిమాలో రష్మికకు కంటే ఎక్కువగా ఈ హీరోయిన్ కి పేరొస్తుంది? ఎవరు ఈ హీరోయిన్?

ప్రస్తుతం ‘గుంటూరుకారం’ సినిమా యూనిట్ అన్నపూర్ణ స్టూడియోలో బిజీగా ఉన్నారు.  ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ వర్చువల్ స్టూడియో ప్రత్యేకత ఏంటంటే? షూటింగ్ కోసం లొకేషన్ల చుట్టూ తిరగకుండా బ్యాగ్రౌండ్‌లో అనుకున్న లొకేషన్ ఉన్న అనుభూతిని కలిగిస్తారు. కావాల్సిన విధంగా మార్పులు చేసి షూటింగ్ కంప్లీట్ చేస్తారు.

Also Read : విడాకులు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

గుంటూరు కారం సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. భారీ ఎక్స్ పెక్టేషన్‌తో వస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా మీనాక్షి చౌదరి, శ్రీలీల, నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.