Kalki 2898 AD : ప్రాజెక్ట్ K గ్లింప్స్ లో ఇది గమనించారా? అమితాబ్ క్యారెక్టర్ ఉండదా? ప్రాజెక్ట్ K గ్లింప్స్ డిటైలింగ్..

సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద 2898 AD అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో ఆ సంవత్సరంలో జరిగే కథ అని తెలుస్తుంది.

Project K Kalki 2898 AD Glimpse Detailing Prabhas Amitabh Bachchan

Kalki 2898 AD Glimpse :  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ పాల్గొన్నారు.

సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద 2898 AD అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో ఆ సంవత్సరంలో జరిగే కథ అని తెలుస్తుంది. గ్లింప్స్ చూస్తే సాధారణంగా ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది అని, ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు కల్కి ఉద్భవిస్తాడని, ప్రజల్ని కాపాడతాడని తెలుస్తుంది.

అయితే గ్లింప్స్ ని డిటైలింగ్ గా గమనిస్తే ఒక రాజు తన ప్రజలని పాలిస్తుంటే ఒక విలన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ రాజుని ఓడించి అతని ప్రజలని విలన్ తనకోసం వాడుకుంటాడు. అలాంటప్పుడు రాజు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు హీరో వస్తాడు. అయితే మొదట అమితాబ్ వచ్చి ఆ తర్వాత ప్రభాస్ వస్తాడని తెలుస్తుంది. గ్లింప్స్ లో అమితాబ్ ని చూపించి ది ఎండ్ అని వేసి, ఆ తర్వాత ప్రభాస్ ని చూపించి ది బిగిన్స్ అని వేశారు. అంటే మొదట అమితాబ్ పోరాడి చనిపోతే ఆ తర్వాత అమితాబ్ కోసం, ప్రజల కోసం ప్రభాస్ రావచ్చు అని తెలుస్తుంది. దీంతో అమితాబ్ క్యారెక్టర్ సినిమా మొత్తం ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. ఇక ప్రాజెక్ట్ K అంటే ప్రాజెక్ట్ కల్కి అని, ప్రభాస్ తో లోకాన్ని కాపాడించడానికి కొంతమంది చేసే యుద్ధం అని తెలుస్తుంది. ఇలా నాగ్ అశ్విన్ గ్లింప్స్ లోనే ఇండైరెక్ట్ గా కథ డిటైలింగ్ ఇచ్చినట్టు అర్ధమవుతుంది. మరి తెరపై ఏం చూపిస్తాడో వెయిట్ చేయాలి.

Project K  : ప్రాజెక్ట్ K గ్లింప్స్, టైటిల్ రిలీజ్.. కలియుగాంతం దేవుడు కల్కి వచ్చేశాడు..

ఇక ఈ గ్లింప్స్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. దీంతో ఒక్కసారిగా ప్రాజెక్ట్ K సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. కచ్చితంగా ఈ సారి హాలీవుడ్ టార్గెట్ గా నాగ్ అశ్విన్ గట్టిగానే ఏదో ప్లాన్ చేశాడని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం రిలీజ్ చేయనున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు