Psych Siddhartha movie postponed due to Akhanda 2
Psych Siddhartha Postponed: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీకి వాయిదా పడింది. అయితే, డిసెంబర్ 12న దాదాపు ఒక 10 చిన్న సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఆ టైంలో అఖండ 2 రావడంతో మిగతా సినిమాల మేకర్స్ వాయిదాల బాట పడుతున్నారు.
Karthi: తమిళ ఇండస్ట్రీ ప్రత్యేకత ఏంటి.. మనకు ఎందుకు భయం.. తెలుగులోలా మనం చేయలేమా..
ఈ లిస్టులో ముందుగా వాయిదా పడుతున్న సినిమా సైక్ సిద్దార్థ(Psych Siddhartha Postponed). నటుడు నందు హీరోగా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు వరుణ్ రెడ్డి తెరకెక్కిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, అఖండ రాకతో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈమేరకు హీరో నందు, నిర్మాత రానా ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఇద్దరు జై బాలయ్య అంటూ స్లోగన్ ఇచ్చారు. ఫైనల్ ఈ సినిమాను 2026 జనవరి 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరి బాలయ్య కోసం విడుదల వాయిదా వేసుకున్న ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.