psych siddhartha ott streaming update
Psych Siddhartha OTT: టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నందు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సైక్ సిద్ధార్థ(Psych Siddhartha OTT)’. కొత్త దర్శకుడు వరుణ్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ తో మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా జనవరి 1న థియేటర్స్ లోకి వచ్చింది. యూత్ ఫుల్ అండ్ అడల్ట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని కూడా మెప్పించింది.
Khushi Soni: MSVG మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి సోనీ.. క్యూట్ ఫోటోలు వైరల్
తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చింది. సైక్ సిద్ధార్థ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది ఆహా. దీంతో ఈ సినిమా ఓటీటీ కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్స్ లో పాజిటీవ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.