Lucky Man : పునీత్ మరణం తర్వాత మరో సినిమా.. ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులు..

మరణించిన తర్వాత పునీత్ సినిమాని తెరపై చూసి ఆయన అభిమానులు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఆయన నటించిన మరో సినిమా రిలీజ్ కి రెడీ అయింది. తమిళ్ లో హిట్ అయిన 'ఓ మై కడవులే' సినిమాని కన్నడలో 'లక్కీ మ్యాన్' పేరుతో........

Lucky Man : పునీత్ మరణం తర్వాత మరో సినిమా.. ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులు..

Puneeth

Updated On : July 26, 2022 / 8:48 AM IST

Puneeth Rajkumar :  ప్రముఖ కన్నడ నటుడు, పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం చాలా మందిని బాధపెట్టింది. ఆయన అభిమానులతో పాటు, కన్నడ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగారు. ఇప్పటికి ఆయన లేని లోటు కన్నడ ప్రజల్లో కనిపిస్తుంది. ఆయన మరణించే ముందు మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అందులో జేమ్స్ ఇటీవల రిలీజయింది. మరణించిన తర్వాత పునీత్ సినిమాని తెరపై చూసి ఆయన అభిమానులు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.

Shruti Haasan : ఒక్క సినిమాకంటే ఎక్కువ చేస్తా అనుకోలేదు.. 13 ఏళ్ళు అప్పుడే అయిపోయాయి..

తాజాగా ఆయన నటించిన మరో సినిమా రిలీజ్ కి రెడీ అయింది. తమిళ్ లో హిట్ అయిన ‘ఓ మై కడవులే’ సినిమాని కన్నడలో ‘లక్కీ మ్యాన్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో డార్లింగ్‌ కృష్ణ, సంగీత శృంగేరి, రోషిణి ప్రకాశ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన పాత్రని కన్నడలో పునీత్ రాజ్ కుమార్ పోషించారు. ఇందులో పునీత్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఇందులో పునీత్ ప్రభుదేవాతో కలిసి స్టెప్పులు కూడా వేశారు. దీంతో ఈ టీజర్ చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఈ సినిమాతో పునీత్ ని థియేటర్స్ లో చూడాలని ఎదురు చూస్తున్నారు కన్నడ ప్రేక్షకులు.