చిరు, చరణ్‌లను పెళ్ళికి పిలిచిన పవర్ స్టార్
రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువ రాజ్ కుమార్ వివాహానికి చిరు కుటుంబాన్ని ఆహ్వానించడానికి పునీత్ హైదరాబాద్ వచ్చాడు..

రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువ రాజ్ కుమార్ వివాహానికి చిరు కుటుంబాన్ని ఆహ్వానించడానికి పునీత్ హైదరాబాద్ వచ్చాడు..
కన్నడ కంఠీరవ, స్వర్గీయ రాజ్ కుమార్ చిన్న కొడుకు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను కలిసాడు. రాజ్ కుమార్ రెండవ కొడుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువ రాజ్ కుమార్ వివాహానికి చిరు కుటుంబాన్ని ఆహ్వానించడానికి పునీత్ హైదరాబాద్ వచ్చాడు. రాజ్ కుమార్ ముగ్గురు కొడుకుల్లో శివ రాజ్ కుమార్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ, సూపర్ స్టార్‌గా కొనసాగుతుండగా, రెండవ కొడుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ వ్యాపార రంగంలోనూ, సినీ నిర్మాణ రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
మూడవ కొడుకు పునీత్ రాజ్ కుమార్.. పవర్ స్టార్‌గా చిత్ర సీమలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. శివ రాజ్ కుమార్‌కి నందమూరి బాలకృష్ణ, పునీత్‌కి జూనియర్ ఎన్టీఆర్ మంచి ఆప్తులు. శివ రాజ్ కుమార్, గౌతమిపుత్ర శాతకర్ణిలో నటిస్తే, పునీత్ చక్రవ్యూహా సినిమాలో ఎన్టీఆర్ పాట పాడాడు. ఈ పెళ్ళికి పలు సినీ పరిశ్రమల ప్రముఖులు అటెండ్ అవనున్నారు. మే 26న మైసూరులో వివాహం, ఆ తర్వాత బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో రిసెప్షన్ జరగనుంది.