×
Ad

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా ‘గంధడ గుడి’ ఓటిటి రిలీజ్‌కి సిద్దమవుతుంది..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021 లో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా పునీత్ నటించిన చివరి సినిమా గంధడ గుడి కూడా ఓటిటి రిలీజ్ కి సిద్దమవుతుంది.

  • Published On : March 16, 2023 / 06:24 PM IST

Puneeth Rajkumar last movie Gandhada gudi is ready to release in ott

Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021 లో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కన్నడ పరిశ్రమను మాత్రమే కాదు మొత్తం సినిమా ప్రపంచనే కలిచి వేసింది. కాగా పునీత్ చనిపోయే సమయానికి ఆయన నటిస్తున్న కొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. పునీత్ అకాల మరణంతో ఆ చిత్రాలు రిలీజులపై సందిగ్ధం ఏర్పడింది. అయితే దర్శక నిర్మాతలు ఆ సినిమాలను ఎలాగోలా పూర్తి చేసి పునీత్ కి ట్రిబ్యూట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే పునీత్ నటించిన జేమ్స్‌, లక్కీమ్యాన్‌, గంధడ గుడి సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి.

Balayya – Shiva Rajkumar : పునీత్ AV చూసి శివరాజ్ కుమార్ కన్నీరు.. బాలయ్య ఓదార్పు!

ఇక తమని విడిచి పెట్టి వెళ్లిపోయిన తమ ‘అప్పు’ ని వెండితెర పై కడసారి చూసుకోడానికి థియేటర్ లకు క్యూ కట్టారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. జేమ్స్‌, లక్కీమ్యాన్‌ ఓటిటి లో కూడా రిలీజ్ కాగా.. ఇప్పుడు అప్పు చివరి మూవీ గంధడ గుడి కూడా ఓటిటి రిలీజ్ కి సిద్దమవుతుంది. గత ఏడాది పునీత్‌ వర్ధంతి సందర్భంగా ఈ చిత్రం థియేటర్ లోకి వచ్చింది. కర్ణాటక అడవుల నేపథ్యంలో తీసిన ఈ మూవీ వైల్డ్‌ లైఫ్‌ డాక్యుమెంటరీగా తెరకెక్కింది. పునీత్ స్నేహితుడు అమోఘ వర్ష ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

పునీత్ సతీమణి అశ్విన్‌ పునీత్‌ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. కాగా మార్చి 17 పునీత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ఓటిటి లోకి తీసుకు వస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో గంధడ గుడి స్ట్రీమ్ కానుంది. ఇక కన్నడ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం దుబ్బింగ్ వెర్షన్ లు గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.