Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ చివరి ట్వీట్ ఇదే.. అంతలోనే గుండెపోటు!

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం సినిమా ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎప్పటిలానే జిమ్ చేస్తున్న పునీత్ ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలిపోయారు.

Puneeth Rajkumar Last Tweet Before Suffer Heart Attack

Puneeth Rajkumar Last Tweet : కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం సినిమా ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎప్పటిలానే జిమ్ చేస్తున్న పునీత్ ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. పునీత్ అకాల మరణంతో అశేష అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు, రాజకీయ ప్రముఖులు పునీత్‌కు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కొంతమంది సినీ ప్రముఖులు స్వయంగా అక్కడికి వెళ్లి ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పిస్తున్నారు.

అభిమాన హీరోను చివరిసారి కళ్లారా చూసుకునేందుకు కోట్లాది మంది అభిమానులు పునీత్ రాజ్ కుమార్ ఇంటికి తరలి వస్తున్నారు. పునీత్ మరణం ఒక్క అభిమానులే కాదు.. మిగతా అందరిని షాకింగ్ కు గురిచేస్తోంది. ఎందుకంటే ఆయన 46ఏళ్ల వయస్సులోనే మరణించారు. అది కూడా జిమ్ చేస్తున్న సమయంలో.. ఊహించని రీతిలో పునీత్ మరణించారు.

పునీత్ చివరి ట్వీట్ ఇదే: 
జిమ్ చేస్తుండగా పునీత్ చివరి ట్వీట్ చేశారు. ఆయన మరణాన్ని ఊహించలేకపోయారు. ట్వీట్ చేసిన కొద్దిగంటల్లోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ మూవీ భజరంగీ 2 మూవీకి బెస్ట్ విషెస్ చెప్పారు. భజరంగీ 2 మూవీ టీంకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ చివరి ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఎప్పటిలానే జిమ్ చేయడం మొదలుపెట్టారు. అంతలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించగా.. ఐసీయూలో చికిత్ప పొందుతూ పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.


పునీత్‌ మరణవార్త ఆయన అభిమానులతో పాటు.. కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. పునీత్‌ మృతి నేపథ్యంలో కన్నడ నాట హై అలర్ట్‌ ప్రకటించారు. ఇక అభిమానుల సందర్శనార్థం పునీత్‌ పార్థీవ దేహాన్ని బెంగళూరు కంఠీరవ స్టేడయంలో ఉంచేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతదేహాన్ని స్టేడియం వద్దకు తరలించగా.. అంత్యక్రియలు శనివారం తండ్రి సమాధి దగ్గరే నిర్వహించనున్నారు. పునీత్‌ కూతురు అమెరికాలో ఉండగా.. ఆమె వచ్చిన తర్వాతే అంత్యక్రియలను నిర్వహించనున్నారు.