Puneeth Rajkumar : పునీత్ మరణించి నేటికి రెండేళ్లు.. ఆయన జ్ఞాపకాలతో కుటుంబం, కన్నడ ఇండస్ట్రీ, అభిమానులు..

నేటికి పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండేళ్లు అవుతుంది. దీంతో ఆయన ద్వితీయ వర్థంతి కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తున్నారు అభిమానులు.

Puneeth Rajkumar : పునీత్ మరణించి నేటికి రెండేళ్లు.. ఆయన జ్ఞాపకాలతో కుటుంబం, కన్నడ ఇండస్ట్రీ, అభిమానులు..

Puneeth Rajkumar Remembering on his second passed away anniversary

Updated On : October 29, 2023 / 9:14 AM IST

Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాత్తుగా 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కన్నడ సినీ పరిశ్రమకే కాక కన్నడ ప్రజలని కూడా శోక సంద్రంలో ముంచేసింది. ఆయన మరణించి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా ఆయన్ని మరువకుండా నివాళులు అర్పిస్తున్నారు కన్నడ ప్రజలు, కన్నడ సినీ పరిశ్రమ.

నేటికి పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండేళ్లు అవుతుంది. దీంతో ఆయన ద్వితీయ వర్థంతి కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తున్నారు అభిమానులు. దేశం నలుమూలల నుంచి పునీత్ అభిమానులు, సెలబ్రిటీలు పునీత్ సమాధిని దర్శించి నివాళులు అర్పిస్తున్నారు. కర్ణాటకలో అభిమానులు ఆయన జ్ఞాపకార్థం పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు.

Also Read : Vishwak Sen : విశ్వక్‌సేన్ సంచలన ట్వీట్.. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు.. సినిమా రిలీజ్ అవ్వకపోతే ప్రమోషన్స్‌కి రాను..

పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాత ఆయన నటించిన రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఇక కన్నడ సినీ పరిశ్రమలో చాలా మంది తమ సినిమా ప్రారంభంలో పునీత్ ని గుర్తు చేసుకుంటూ ‘అప్పు లివ్స్ఆన్’ అని పునీత్ ఫొటో వేస్తున్నారు. పునీత్ మరణించాక సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి మరియు ఆయన చేసిన దాతృత్వ కార్యక్రమాలకు గాను డాక్టరేట్‌తో మైసూరు విశ్వవిద్యాలయం సత్కరించింది. అలాగే పునీత్ రాజ్ కుమార్ కి ఆయన మరణానంతరం కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డుని ప్రకటించి ఆయన భార్య అశ్వినికి అందచేసింది.

పునీత్ మరణించిన తర్వాత నుంచి ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో, సినీ పరిశ్రమలో, సినీ ఈవెంట్స్ లో కూడా పునీత్ ని తలుచుకుంటూ బాధపడుతున్నారు. నేడు పునీత్ దూరమయి రెండేళ్లు అవ్వడంతో మరోసారి ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు.